తెలుగులో `జైచిరంజీవి`, `అశోక్`, `నరసింహుడు` చిత్రాల్లో నటించిన హీరోయిన్ సమీరారెడ్డి. ఈమె అక్షయ్ వర్దే అనే వ్యాపారవేత్తను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ దంపతులకు శుక్రవారం ఉదయం పాప పుట్టింది. ఈ విషయాన్ని సమీరా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలియజేసింది. “చిన్నారి దేవత మా ఇంట్లోకి పాప రూపంలో అడుగుపెట్టింది. మాకు ఆశీర్వాదాలు అందించిన అందరికీ ధన్యవాదాలు“ అంటూ ఆమె పోస్ట్ చేశారు. ఇప్పటికే అక్షయ్, సమీరా దంపతులలకు హన్స్ అనే మూడేళ్ల బాబు ఉన్నాడు. రీసెంట్ టైమ్లో పాజిటివిటీ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటూ సమీరా సోషల్ మీడియాలో పెగ్నెన్సీతోనే ఫొటోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
previous post
next post