న్యూస్ సినిమా హెల్త్

Bala Krishna: బాలయ్య అభిమానులకు బ్యాడ్ న్యూస్.. బాబుకు మరోసారి సర్జరీ చేసిన డాక్టర్లు?

Share

Bala Krishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మంచి జోష్ లో ఉన్నారు. ఇటీవల ‘అఖండ’ సినిమా భారీ విజయంతో కొత్త ఉత్సాహంతో సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. అయితే ఆ ఉత్సాహానికి కాస్త అతని అనారోగ్యం అడ్డుకట్ట వేయడంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఒక పక్క సినిమాలతో బిజీగా ఉంటూనే మరో పక్క రాజకీయాల్లో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటున్నారు బాలకృష్ణకు కాస్త విరామం అవసరం అన్నారు డాక్టర్లు. దాంతో బాలయ్య అభిమానులు తీవ్ర ఆందోళనలకు లోనయ్యారు.

బాలకృష్ణ గత కొన్ని రోజులుగా మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. దీంతో డాక్టర్లు ఆయన మోకాళ్ల నొప్పికి తాజాగా ఓ ఆపరేషన్ చేసారు. ఆపరేషన్ తర్వాత బాలయ్య ఆస్పత్రిలో డాక్టర్స్‌తో దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో బాలకృష్ణ మోకాలికి కట్టు వేసి ఉండటం మనం గమనించవచ్చు. దీనిపై డాక్టర్స్ మాట్లాడుతూ.. బాలకృష్ణ కు జరిగింది మైనర్ సర్జరీనేనని, ఆయన ఆరోగ్యం పూర్తిగా బాగుందని, అభిమానులు కంగారు పడాల్సిందేమి లేదని, కొన్ని రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని తెలిపారు. దీంతో బాలయ్య అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

ఇకపోతే ఇటీవలే బాలయ్య భుజానికి శస్త్ర చికిత్స జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అఖండ సినిమా షూటింగ్ లో జరిగిన ఒక చిన్న ప్రమాదంలో ఆయన కుడిభుజంకు గాయం కావడంతో శస్త్ర చికిత్స జరిగింది. ఇక తాజా ఘటనతో మరోసారి వైద్యులు ఆయనకు మోకాళ్ల నొప్పికి శస్త్రచికిత్స చేశారు. సినిమాల విషయానికొస్తే, బాలయ్య మోకాలికి శస్త్రచికిత్స జరిగి రెస్ట్ తీసుకోవాల్సి రావడంతో గోపీచంద్ మలినేనితో జరుగుతున్న సినిమా షూటింగ్ కి తాత్కాలికంగా బ్రేక్ పడింది. అలాగే అఖండ విడుదలయిన కొన్ని రోజులకే అఖండ 2 ఉండనుందని క్లారిటీ ఇచ్చేశాడు బోయపాటి. ప్రస్తుతం రామ్‌తో ఓ సినిమా చేయడానికి సిద్ధమయిన బోయపాటి.. తర్వాత అఖండ 2 ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టనున్నట్టు భోగట్టా.


Share

Related posts

Yami Gautam: యామి గౌతమ్ పెళ్లి ఫోటోలు.. సోషల్ మీడియాలో వైరల్..!!

bharani jella

అఖిల్ 5 కి రాం చరణ్ కథ ఫిక్స్ చేశాడా…అయితే అఖిల్ కి భారీ హిట్ ఖాయమా..?

GRK

Pawan Kalyan : పవన్ సినిమాకి పోటీగా సీనియర్ హీరో సినిమా..??

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar