SSMB 28: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతి సంవత్సరం తండ్రి కృష్ణ పుట్టినరోజు నాడు మే 31వ తారీకు తన సినిమాకి సంబంధించి అప్డేట్ ఇవ్వటం సెంటిమెంట్. అయితే గత ఏడాది కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశంలో పరిస్థితి దారుణం గా ఉండటం తో ఎటువంటి అప్డేట్ రాలేదు. అంతకు ముందు సంవత్సరం “సర్కారు వారి పాట” టైటిల్ తో పాటు త్రివిక్రమ్- మహేష్ సినిమాకి సంబంధించిన చిన్న పాటి వీడియో రిలీజ్ అయింది. అయితే ఈసారి త్రివిక్రమ్ సినిమా కి సంబంధించి కొత్త అప్ డేట్ కృష్ణా పుట్టినరోజు నాడు అనగా నేడు మే 31 వ తారీకు వస్తుందని గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ క్రమంలో టైటిల్ ప్రకటిస్తారని.. అందరూ భావించారు. “అర్జునుడు” లేదా “పార్ధు” అనే టైటిల్ పెట్టినట్లు కూడా న్యూస్ వైరల్ అయింది. కానీ లేటెస్ట్ టాక్ ఏమిటంటే కృష్ణ బర్త్ డే నాడు నేడు త్రివిక్రమ్.. మహేష్ సినిమాకి సంబంధించి ఎటువంటి అప్ డేట్ ప్లాన్ చేయలేదని టాక్. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం మహేష్ ఫ్యామిలీతో యూరప్ ట్రిప్ లో ఉండటంతో టైటిల్ ఒకటి ప్రకటిస్తే బాగుంటుందని సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేస్తే అప్పుడు బాగుంటుందని.. భావించి మొత్తానికి ఆపేసినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే యూరప్ ట్రిప్ నుండి వచ్చాక జూలైలో సినిమా షూటింగ్ మొదలు కానున్న తరుణంలో… ఆగస్టులో మహేష్ పుట్టినరోజు నాడు టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్ చేయాలని డైరెక్టర్ త్రివిక్రమ్ డిసైడ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి కృష్ణ పుట్టిన రోజు నాడు త్రివిక్రమ్ సినిమా టైటిల్ వస్తుందని భావించిన గాని ఇప్పటివరకు రాకపోవడంతో తాజా వార్త విని మహేష్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయినట్లు సమాచారం.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!