నందమూరి బాలకృష్ణ 105వ సినిమాకు సంబంధించిన క్లారిటీ వచ్చేసింది. ఆయన పుట్టినరోజు సందర్భంగా నిర్మాత సి.కల్యాణ్, దర్శకుడు కె.ఎస్.రవికుమార్ ఆయన్ను ప్రత్యేకంగా కలిసి అభినందించడమే కాదు.. కల్యాణ్ నిర్మాతగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సినిమా ఉంటుందని ప్రకటన ఇచ్చుకున్నారు. ఇన్ని రోజులు ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వినిపిస్తోన్న నేపథ్యంలో ఈ వార్త అభిమానులకు ఆనందాన్నిచ్చే విషయమే. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాకు `క్రాంతి` అనే టైటిల్ పరిశీనలో ఉంది. `జైసింహా` తర్వాత బాలకృష్ణ, కె.ఎస్.రవికుమార్ కలయికలో రాబోయే సినిమా ఇది.
previous post
next post
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!