సినిమా

Mokshagna: బోయపాటి చేతికి చిక్కిన మోక్షజ్ఞ! బాలకృష్ణ సెంటిమెంట్ కారణమా?

Share

Mokshagna:  ప్రస్తుతం బాలకృష్ణ హవా నడుస్తోందనే చెప్పుకోవాలి. ఇటీవల విడుదలైన అఖండ ఖండాంతరాలు దాటి విజయాన్ని నమోదు చేసింది. 5 పదులు దాటుతున్నా ఇవ్వాల్టి తరం హీరోలకు గట్టిపోటీ ఇస్తూ వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగిపోతున్నారు నందమూరి నటసింహం. ఇదంతా పక్కనే పెడితే, బాలకృష్ణ వారసుడు అయినటువంటి మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై టాలీవుడ్లో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. కానీ ఈ విషయం పైన ఇప్పటివరకు బాలయ్య నోరు మెదపలేదు.

Ginger Oil: ఈ నూనె తో జలుబు నుంచి క్యాన్సర్ వరకు అన్నింటినీ నయం చేస్తుంది..!!
ఈసారి మోక్షజ్ఞ ఎంట్రీ తప్పదా?

మోక్షజ్ఞ ఎంట్రీపైన ఓ క్లారిటీ రాకపోవడం నందమూరి అభిమానులను కాస్త నిరాశ పర్చుతోంది. బాలయ్య 100వ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ తోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని అందరు భావించారు. కానీ జరగలేదు. అయితే తాజాగా బాలయ్య మోక్షజ్ఞ సినీ ఎంట్రీ తప్పకుండా ఉంటుందని ప్రకటించి అభిమానులకు కాస్త బూస్టింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ వైపుగా అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. బాలయ్య బాబు హీరోగా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ సాధించిన ‘ఆదిత్య 369’ సీక్వల్‌తో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉంటుందని అంతా భావిస్తున్నారు.

YSRCP MP: ఆ ఎంపీలు డౌటే..!?పార్టీలో ఒంటరిగా ఎంపీలు..!

Mokshagna:  ఈ సినిమా బోయపాటి దర్శకత్వంలో వుండబోతుందా?

ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్స్ కూడా ఫినిష్ అయినట్టు సమాచారం. బాలయ్యకు హాట్రిక్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్‌తోనే మోక్షజ్ఞ ఎంట్రీ జరగాలని సెంటిమెంటల్‌గా బాలయ్య ఫీల్ అవుతున్నారట. ప్రస్తుతం దీని గురించి చర్చలు వేడిగా జరుగుతున్నట్టు టాలీవుడ్లో గుసగుసలు వినబడుతున్నాయి. ఇక బోయపాటి ‘ఆదిత్య 369’ సీక్వల్‌‌ చేస్తారా? లేక మరో బలమైన ఊర మాస్ కథతో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతారా అనేది ప్రస్తుతానికి ఓ క్వశ్చన్ మార్క్. ఏది ఏమైనా బోయపాటి తన మార్క్ ఉండేలా చూసుకుంటాడు గనుక మోక్షజ్ఞకు తప్పక మోక్షం లభిస్తుందని అందరూ భావిస్తున్నారు.


Share

Related posts

Pawan Kalyan: పవన్ అభిమానులకు పూనకాలు తెప్పించే న్యూస్.. మరో సినిమా చేయబోతున్న త్రివిక్రమ్!

Ram

విజ‌యం ఇచ్చిన ఉత్సాహంతో..

Siva Prasad

Bigg boss Lasya : బిగ్ బాస్ లాస్య ఇల్లు చూస్తే వావ్ అనాల్సిందే?

Varun G