Akhanda: బోయపాటి దర్శకత్వంలో బాలయ్య బాబు నటిస్తున్న మూడో సినిమా “అఖండ“. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టించడంతో “అఖండ” సినిమాపై అంచనాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా బాలయ్య ప్రస్తుతం వరస ఫ్లాపుల్లో ఉండటంతో.. ఈ సినిమాతో హిట్ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.
గతంలో పూర్తిగా పరాజయం లో బాలయ్య కూరుకు పోయి ఉన్న సమయంలో… బోయపాటి మర్చిపోలేని విజయాలు ఇవ్వటంతో ఈ సినిమాతో వీరిద్దరూ యాక్టివ్ కొట్టాలని ఆశిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన టీజర్ సోషల్ మీడియాలో అనేక రికార్డులు సృష్టించడంతో పాటు బాలయ్య బాబు గతంలో ఎన్నడూ లేనివిధంగా అఘోర పాత్ర చేయడంతో… ఈ పాత్రలో బాలయ్య ఏ విధంగా నటించాడు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Read More: Balakrishna: మరోసారి బాలకృష్ణ సినిమాకి పనిచేస్తున్న దేవి శ్రీ ప్రసాద్..!!
ఇదిలా ఉంటే ఈ క్యారెక్టర్ గురించి సరికొత్త వార్త తాజాగా ఇండస్ట్రీ లో వైరల్ అవుతుంది. మేటర్ లోకి వెళ్తే అఘోర పాత్రలో బాలయ్య బాబు చెప్పే డైలాగులు మొత్తం సంస్కృతంలో ఉంటాయని… శ్లోకాల మాదిరిగా ఘంటాపదంగా.. బాలయ్య బాబు డైలాగులు సినిమాలో ఉంటాయని.. ఈ డైలాగులు చెప్పే సమయంలో కనీసం ఒక్క ఎక్స్ట్ టేక్ తీసుకోకుండా సింగిల్ టేక్..తో చెప్పటం జరిగిందట. సింగిల్ టేక్ లోనే పక్కా పర్ఫెక్షన్ వచ్చే తరహాలో బాలయ్య.. చెప్పటంతో షూటింగ్ లొకేషన్ లో దర్శకుడు తో పాటు మిగతా వాళ్లు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి నెలకొందట.