Akhanda: బోయపాటి దర్శకత్వంలో బాలయ్య సినిమా వస్తుందంటే చాలు బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త రికార్డులు నమోదు కావటం గ్యారెంటీ. గతంలో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పాత రికార్డులను తిరగరాసి సరికొత్త లెక్కలు నమోదు చేశాయి. ఈ నేపథ్యంలో వస్తున్న మూడో సినిమా కూడా అదే రేంజ్ లో హిట్ అవ్వాలని డైరెక్టర్ బోయపాటి “అఖండ” సినిమాకి సంబంధించి ప్రతి సన్నివేశం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవటం జరిగిందట.
వరస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్య బాబు “అఖండ” తో విజయం సాధించాలని బోయపాటితో హ్యాట్రిక్ కొట్టాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో చాలా వైవిధ్యంగా బాలయ్య బాబుని ఈ సినిమాలో మూడు రకాలుగా చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ మూడింటిలో అఘోర పాత్ర సినిమాకి ఊహించని రీతిలో హైలెట్ అవుతుందని సినిమా యూనిట్ నుండి అందుతున్న టాక్. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన టీజర్ లో బాలయ్య బాబు అఘోర గెటప్ లో బాలయ్య హై వోల్టేజ్ యాక్షన్ పలికిన డైలాగులు .. చూసిన అభిమానులు డౌట్ లేదు మరోసారి బోయపాటి బాలకృష్ణతో బ్లాక్ బస్టర్ కొట్టారని డిసైడ్ అయిపోయారు.
ఇదిలా ఉంటే సరిగ్గా ఇంటర్వెల్ బ్యాంగ్ పది నిమిషాల ముందు అఘోర స్క్రీన్ మీద ప్రజెంట్ అవుతుందట. అక్కడి నుండి సినిమా ఉన్న కొద్ది పైకి తీసుకెళ్లే రీతిలో యాక్షన్ సన్నివేశాలు.. సినిమా స్టోరీ మొత్తం మారిపోతుందని.. అఘోర క్యారెక్టర్ మూవీలో వన్ సైడ్ వార్ తరహాలో బోయపాటి డిజైన్ చేశాడని సరికొత్త వార్త ఇప్పుడు ఇండస్ట్రీ లో వినపడుతోంది.