Akhanda: వరస ప్లాపుల్లో ఉన్న బాలయ్య బాబు గత ఏడాది “అఖండ” సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కడం జరిగింది. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 2వ తారీకు రిలీజ్ అయ్యి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టించింది. సెకండ్ వేవ్ తరువాత ఇండస్ట్రీ పరంగా ప్రభుత్వాల పరంగా అనేక సమస్యలు ఉన్న సమయంలో… చాలా పెద్ద సినిమాలు విడుదల చేయటానికి వెనుకడుగు వేస్తున్న తరుణంలో బాలయ్య బాబు డేరింగ్ అండ్ డాషింగ్ గా.. అఖండ రిలీజ్ చేసి ఓవరాల్ గా 50 రోజుల నిడివిలో 200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం జరిగింది.
అంత మాత్రమే కాక అంత సెంటర్లలో 50 రోజులు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. తన కెరియర్లోనే పదిరోజుల్లో 100కోట్ల క్లబ్బులో చేరిన సినిమా కం ఫాస్టెస్ట్ 100 కోట్ల కలెక్షన్లు తన కెరియర్ లో సాధించిన సినిమాగా అఖండ నిలిచింది. కాగా తాజాగా ఈ సినిమా డిస్నీ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఓటిటిలో కూడా సరికొత్త రికార్డ్ సృష్టించినట్లు సమాచారం.
మేటర్ లోకి వెళితే డిస్నీ హాట్ స్టార్ లో రిలీజ్ అయిన సినిమాల్లోకెల్లా… అఖండ సినిమా స్ట్రీమింగ్ అయిన కొద్ది గంటల్లోనే చాలామంది చూసినట్లు డిస్నీ హాట్ స్టార్ లో ఏ తెలుగు హీరో సాధించని రీతిలో బాలకృష్ణ అఖండ తో సాధించినట్లు లేటెస్ట్ టాక్ సోషల్ మీడియాలో వినబడుతోంది. అఘోర పాత్రల్లో బాలకృష్ణ యాక్టింగ్ కి బోయపాటి టేకింగ్ కి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన సంగీతం సినిమా మొత్తానికే హైలైట్. ఊహించని రీతిలో తమన్ అఖండ సినిమా కి బాలయ్య బాబు కి.. భారీ ఎత్తున బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించడం జరిగింది. సినిమాకి హైలెట్ గా నిలిచింది.