సినిమా

Balakrishna-Allu arjun-Nani: త‌గ్గేదే లే అనిపించుకున్న బ‌న్నీ, బాల‌య్య‌, నాని.. మూడు చోట్లా కుమ్మేశారుగా!

Share

Balakrishna-Allu arjun-Nani: న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, న్యాచుర‌ల్ నాని.. ముగ్గురు మొత్తానికి త‌గ్గేదే లే అనిపించుకున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. బాల‌య్య, బోయ‌పాటి కాంబినేష‌న్‌లో ముచ్చ‌ట‌గా మూడో సారి తెర‌కెక్కిన చిత్రం `అఖండ‌`. ద్వారకా క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబ‌ర్ 2న విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది.

 balakrishna allu arjun nani movies trend on top place in ott
balakrishna allu arjun nani movies trend on top place in ott

అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌ష్మిక హీరోయిన్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం.. రెండు భాగాలుగా రాబోతోంది. అయితే మొద‌టి పార్ట్ పుష్ప ది రైస్ డిసెంబ‌ర్ 17న విడుద‌లై.. నెగ‌టివ్ టాక్ తెచ్చుకుంది. అయిన‌ప్ప‌టికీ ఈ మూవీ క‌లెక్ష‌న్ల ప‌రంగా బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ము దులిపేసింది.

 balakrishna allu arjun nani movies trend on top place in ott
balakrishna allu arjun nani movies trend on top place in ott

నాని విష‌యానికి వ‌స్తే.. ఈయ‌న న‌టించిన తాజా చిత్రం `శ్యామ్ సింగ‌రాయ్‌`. ట్యాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌వి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. కలకత్తా బ్యాక్ డ్రాప్‌లో రూపుదిద్దుకున్న‌ ఈ సినిమా సైతం డిసెంబ‌ర్ 24న రిలీజై మంచి విజ‌యం సాధించింది.

 balakrishna allu arjun nani movies trend on top place in ott
balakrishna allu arjun nani movies trend on top place in ott

ఇక ఈ మూడు చిత్రాలు ఇటీవ‌లె వేరువేరు ఓటీటీల్లో విడుద‌ల అయ్యాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో పుష్ప మొద‌ట అందుబాటులోకి రాగా.. డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో అఖండ‌, నెట్‌ఫ్లిక్స్‌లో శ్యామ్ సింగ‌రాయ్‌లు ఒకే రోజు స్ట్రీమింగ్ అయ్యాయి. అయితే ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. ఈ మూడు చిత్రాలు అల్టిమేట్ వ్యూవర్ షిప్ తో ఇప్ప‌టికీ ఆయా ఓటీటీల్లో టాప్ ప్లేస్‌లోనే ట్రెండ్ అవుతున్నాయి. మొత్తానికి మూడు ఓటీటీల్లోనూ బ‌న్నీ, బాల‌య్య‌, నానిలు కుమ్మేశార‌ని చెప్పాలి.


Share

Related posts

అయ్యో.. క్రియేటివిటీ పోయిందా

Siva Prasad

Madonna Sebastian Pink Saree Picks

Gallery Desk

SVP: షూటింగ్ విషయంలో “సర్కారు వారి పాట” సినిమా యూనిట్ సరికొత్త రూల్..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar