వరుస ఫ్లాపుల్లో ఉన్న నందమూరి బాలయ్య బాబు ప్రస్తుతం బోయపాటి తో సినిమా చేస్తున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టించాయి. దీంతో ప్రస్తుతం చేస్తున్న మూడో సినిమా తో ముచ్చటగా హ్యాట్రిక్ కొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. హ్యాట్రిక్ కాంబినేషన్ అంటే మామూలుగా మార్కెట్లో ఓ రేంజ్ లో సినిమా ధర పలుకుతుంది. కానీ ఈ సినిమాకి సీన్ రివర్స్ గా మారింది.
పూర్తి విషయంలోకి వెళితే సినిమాకి సంబంధించి శాటిలైట్ డీల్ ఇంకా పూర్తి కాలేదు అంట. మరోపక్క టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలు సెట్స్ మీదకు వెళ్లకముందే… భారీ స్థాయిలో అమ్ముడుపోయాయి. ఈ విధంగా సూపర్ స్టార్ మహేష్ నటించబోయే సర్కారీ వారి పాట సినిమా శాటిలైట్ రైట్స్ అమ్ముడు పోవడం జరిగింది.
పరిస్థితి ఇలా ఉండగా బాలయ్య-బోయపాటి సినిమాకు ఇంకా శాటిలైట్ డీల్ సెట్ అవ్వకపోవటం తో నిర్మాతల టెన్షన్ నెలకొన్నట్లు టాక్. మరోపక్క చూస్తే ఈ సమస్యకు కారణం సినిమాకి సంబంధించి భారీ రేట్ అని ఇండస్ట్రీలో టాక్. పైగా కరోనా వైరస్ రావడం తో ఇంకా రేట్లు పడిపోవడంతో… బాలయ్య బోయపాటి సినిమా శాటిలైట్ రైట్స్ ఏ స్థాయిలో అమ్ముడు పోతాయో అన్నది మాత్రం ఎవరికీ అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది అని టాలీవుడ్ వర్గాలలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.