మిషన్ ’70’

ఎన్టీఆర్ బయోపిక్ సినిమా అయిపోయాక, వినాయక్ తో బాలకృష్ణ నెక్స్ట్ మూవీ ఉందనుకుంటే ఆ ఛాన్స్ బోయపాటి కొట్టేసి అందరికీ షాక్ ఇచ్చాడు. నిజానికి బాలయ్య-బోయపాటి కలయికలో సినిమా గురించి చాలా రోజులుగా వార్తలు వస్తున్నా కూడా వినాయక్ మూవీ అయ్యాక బోయపాటి ప్రాజెక్ట్ ఉంటుంది అనుకున్నారు కానీ వినాయక్ ని సైడ్ చేసి బోయపాటి రేస్ లోకి వచ్చాడు. ఈ కాంబినేషన్ లో సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రెగ్యులర్ షూటింగ్ కోసం సెట్స్ పైకి ఈ సినిమా వెళ్లబోతుందని చెప్తూ మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

ఇప్పుడీ మోషన్ పోస్టర్ వీడియో నందమూరి అభిమానులని ఖుషి చేస్తుంది దానికి కారణం ఇప్పటికే బాలయ్యకు రెండు ఊరమాస్ హిట్స్ ఇచ్చిన
బోయపాటి, వాటిని మించే స్థాయిలో ఈ ప్రాజెక్ట్ ఉంటుందని చెప్పడమే. బాలయ్య పల్స్ ని కరెక్ట్ గా పట్టుకున్న బోయపాటి, ఈసారి ఏ రేంజులో చూపిస్తాడో అని వారంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే కథని పూర్తి చేసిన బోయపాటి శ్రీను, ఈ మూవీని కేవలం 70రోజుల్లో పూర్తి చేయబోతున్నాడు. ఒక స్టార్ హీరో సినిమాని 70 రోజుల్లో పూర్తి చేయడం అంటే సాహసమే కానీ బాలకృష్ణ… శాతకర్ణి, ఎన్టీఆర్ బయోపిక్ లాంటి భారీ ప్రాజెక్ట్స్ నే 90 రోజుల్లో పూర్తి చేశాడు కాబట్టి 70 డేస్ లో కొత్త సినిమాని కంప్లీట్ చేయడం అతనికి పెద్ద కష్టమేమి కాదు. ఈ ప్రాజెక్ట్ గురించి వినిపిస్తున్న మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 70 రోజుల్లో 70 కోట్లతో తెరకెక్కబోయే ఈ సినిమా ఫిబ్రవరిలో మొదలు పెట్టి మే చివరి నాటికీ పూర్తి ఎన్నికలు అయ్యాక ఫ్యాన్స్ కి స్పెషల్ గిఫ్ట్ గా ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నాడు. ఇక బాలయ్య-బోయపాటి అంటేనే మాస్ టైటిల్స్ కి పెట్టింది పేరు. మరి సింహా, లెజెండ్ తర్వాత ఈ ఊరమస్ కాంబినేషన్ ఎలాంటి టైటిల్ తో వస్తుంది? ఎప్పుడు వస్తుంది? ఎన్ని రికార్డ్స్ సృష్టిస్తుంది అనేది చూడాలి.