Unstoppable 2: అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ రసవత్తరంగా సాగుతుంది. మొదటి సీజన్ కంటే టాప్ మోస్ట్ సెలబ్రిటీలు వాళ్లతో పాటు తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ రాజకీయ నాయకులు వస్తూ ఉండటం మరింత ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. ఇండియాలో అన్ని టాకీ షోలలో అన్ స్టాపబుల్ అనేక రికార్డులు క్రియేట్ చేస్తుంది. హోస్ట్ గా బాలకృష్ణ లో ఉన్న మరో కోణం నటుడిని మించి పోయే రీతిలో వీక్షకులను అలరిస్తోంది. ఎటువంటి గెస్ట్ అయినా సరే తనదైన శైలిలో కామెడీ పండిస్తూ… షోనీ మరింత ఇంట్రెస్ట్ కలిగించే రీతిలో ముందుకు నడిపిస్తూ మరో పక్క ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేస్తూ… విజయవంతమైన మంచి ఔట్ పుట్ ఎపిసోడ్ లు వచ్చేలా చేస్తున్నారు.
సెకండ్ సీజన్ స్టార్టింగ్ ఎపిసోడ్ నుండి అన్నీ కూడా ఆహా వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే ఈ సంవత్సరం చివరిలో… మరింతగా ఆకట్టుకునే రీతిలో ఆహా టీం ప్లాన్ చేయటం జరిగింది. దీనిలో భాగంగా అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ వేదిక పైకి పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ షూట్ కూడా కంప్లీట్ అయింది. ప్రభాస్ తో పాటు ఆయన ఫ్రెండ్ మరో హీరో గోపీచంద్ కూడా వచ్చారు. గత కొద్దిరోజులుగా ప్రభాస్ అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ కి సంబంధించి వచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పరిస్థితి ఇలా ఉంటే తాజాగా ఆహా టీం సరికొత్త అప్డేట్ ఇచ్చింది. త్వరలో స్ట్రీమింగ్ కానున్న ఈ ఎపిసోడ్ కి సంబంధించిన స్పెషల్ వీడియో గ్లింప్స్ నేడు అభిమానుల కోసం రిలీజ్ చేస్తున్నట్లు ఆహా టీం తెలియజేసింది. ఇంకేం తాభిమానాలు ఫుల్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ పెళ్లి కి సంబంధించి కచ్చితంగా బాలకృష్ణ ప్రస్తావన తీసుకొస్తారు అని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ పెళ్లికి సంబంధించి ఎటువంటి సమాధానం ఇస్తాడు అనేదాని గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!