Balakrishna: నందమూరి బాలయ్య బాబు “అఖండ” బ్లాక్ బస్టర్ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న సంగతి తెలిసిందే. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాలయ్య బాబు కెరీర్ లో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించింది. అంతకుముందు వీరిద్దరి కాంబినేషన్ లో సింహా, లెజెండ్ విజయాలు సాధించటంతో అఖండ తో హ్యాట్రిక్ విజయం సాధించడం జరిగింది. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం బాలయ్య బాబు అనిల్ రావిపూడి దర్శకత్వం లో మరోసారి మాస్ తరహా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలయ్య బాబు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కావడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. తెలంగాణ ప్రాంతంలో సిరిసిల్ల జిల్లాలో ఫైట్ తో షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇదిలా ఉంటే దర్శకుడు అనిల్ రావిపూడి తన సినిమా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది. మేటర్ లోకి వెళ్తే కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ నీ తీసుకోవడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. మరోపక్క బాలకృష్ణ మాత్రం తమన్ తో అయితే బాగుంటుంది అని డైరెక్టర్ తో చర్చలు జరుపుతున్నట్లు వీరిద్దరిలో ఒకరిని కన్ఫామ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. చాలావరకు అనిల్ రావిపూడి… అనిరుద్ కే అవకాశం ఇవ్వాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క పరాజయం కూడా లేని డైరెక్టర్ గా అనిల్ రావిపూడి గ్రాఫ్ ఉండటంతో… బాలయ్య బాబు సినిమాపై నందమూరి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.