Unstoppable 2: ఆహా ఓటీటీలో “అన్ స్టాపబుల్” టాకీ షో ఓ రేంజ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సెకండ్ సీజన్ కి చాలా బిగ్ స్టార్స్ తో పాటు పొలిటికల్ లీడర్ లు వస్తున్నారు. దీంతో వ్యూస్ విషయంలో మొదటి సీజన్ కంటే రెండో సీజన్ భారీ ఎత్తున రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి పలువురు బిగ్ స్టార్స్ రావడం జరిగింది. అయితే న్యూ ఇయర్ సందర్భంగా చాలా వైవిధ్యంగా ఆహా టీం ప్రభాస్ తో ఎపిసోడ్ ప్లాన్ చేయడం తెలిసిందే.
ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయింది. డార్లింగ్ ప్రభాస్ మరియు బాలయ్య మంచి జోష్ మీద ఎపిసోడ్ లో కనిపించారు. అయితే డిసెంబర్ 30వ తారీకు ఈ ఎపిసోడ్ ప్రసారం చేస్తున్నట్లు అప్పట్లో తెలియజేశారు. కానీ తాజాగా డిసెంబర్ 30వ తారీకు మొదటి పార్ట్ ఇక జనవరి ఆరవ తారీకు సెకండ్ పార్ట్ రెండు భాగాలుగా ప్రభాస్ “అన్ స్టాపబుల్” ఎపిసోడ్ రిలీజ్ చేస్తున్నట్లు ఆహా టీం చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో మొదటి పార్ట్ కి సంబంధించి.. ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో ప్రభాస్ బాలకృష్ణ మధ్య చాలా ఫన్నీ కన్వర్జేషన్ జరిగింది. ఇదే సమయంలో సంక్రాంతికి మొదట తన సినిమాని చూడాలని.. తర్వాత నాన్నగారు సినిమా అని రామ్ చరణ్ తో ఫోన్ లో మాట్లాడిన సమయంలో బాలకృష్ణ పేర్కొన్నారు.
పెళ్లి గురించి మాట్లాడుతూ పెళ్లి చేసుకుంటావా లేదా అని బాలకృష్ణ ప్రశ్నించారు. దానికి అసలు పెళ్లి గీత నాకు లేదేమో సార్.. అంటూ ప్రభాస్ సమాధానం ఇవ్వటం జరిగింది. చత్రపతి గురించి కూడా కొన్ని విషయాలు ప్రభాస్ తెలియజేశారు. ఇదే సమయంలో అభిమానులు ఫ్రెండ్స్ నిన్ను డార్లింగ్స్ అంటారు. మరి గర్ల్ ఫ్రెండ్స్ ఏమని పిలుస్తారు అని బాలయ్య ప్రశ్నేశారు. ఇంకా నువ్వు డార్లింగ్ అంటే దెయ్యాలు కూడా దేవతల్లా మారిపోతాయి అంటూ బాలకృష్ణ చాలా ఫన్నీ కన్వర్జేషన్ ప్రభాస్ తో మొదటి పార్ట్ ప్రోమో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.