Bhagavanth Kesari Trailer: అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం ఆదివారం అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కుర్ర హీరోయిన్ శ్రీ లీల, బాలకృష్ణ.. సినిమాలో నటించిన మరి కొంతమంది నటీనటులు పాల్గొన్నారు. ట్రైలర్ నిడివి రెండు నిమిషాల 51 సెకండ్ లు ఉంది. సినిమాలో బాలకృష్ణ కూతురిగా శ్రీ లీల నటించింది. కూతురిని ఆర్మీకి పంపాలని ఆశయం కలిగిన తండ్రిగా బాలకృష్ణ.. ట్రైలర్ లో శ్రీలీల తో అనేక ఎక్సర్సైజులు చేయించడం చూపించారు. అయితే ఆర్మీకి వెళ్లడం ఇష్టం లేని కూతురిగా శ్రీ లీల కనిపించింది.
ఆ తర్వాత సినిమాలో యాక్షన్స్ సన్నివేశాలు తెలంగాణ యాసలో బాలకృష్ణ పలికిన డైలాగులు చాలా ఎంటర్టైన్మెంట్ గా అనిపించాయి. బాలయ్య… శ్రీలీల మధ్య ఎక్కువ భావోద్వేక కరమైన సన్నివేశాలు నిండి ఉన్నాయి. సినిమాకి శ్రీ లీల పాత్ర కీలకమని తెలుస్తోంది. తెలంగాణ యాసలో బాలకృష్ణ పలికే డైలాగులు హైలైట్ గా నిలిచాయి. “ఎత్తిన చెయ్యి ఎవనిదో తెలియాలే, లేచిన నోరెవరిదో తెలియాలే, మిమ్మల్ని పంపిన కొడుకెవడో తెలియాలే…”, “ష్… సప్పుడు జెయ్యాక్” అంటూ బాలయ్య నోటి వెంట డైలాగులు పవర్ ఫుల్ గా వెలువడడం ట్రైలర్ లో చూడొచ్చు. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ పాత్ర పోషించారు.
ట్రైలర్ లో అసలు విలన్ కి బాలకృష్ణ, శ్రీలీలకి సంబందం ఏంటి అనే సస్పెన్స్ ఉంచారు. బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ట్రైలర్ చివరిలో బ్రో ఐ డోంట్ కేర్ అంటూ బాలయ్య డైలాగు వేయడం జరిగింది. అంతేకాదు లెజెండ్ సినిమాలో నీకంటే చూపుల్లో అనే సాంగ్ జైల్లో పాడటం చూపించారు. తెలంగాణ యాసలో బాలయ్య అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో “భగవంత్ కేసరి” ట్రైలర్ లో చెలరేగిపోయారు.