Balakrishna: వినోదానికి పెద్ద పీట వేస్తూ కమర్షియల్ చిత్రాలతో వరుస హిట్లను ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి.. రీసెంట్గా `ఎఫ్ 3`తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఇందులో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించగా.. మిల్కీ బ్యూటీ తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించారు.
`ఎఫ్ 2`కు సీక్వెల్‌గా రూపుదిద్దుకున్న ఈ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మే 27న విడుదలై ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. కడుపుబ్బా నవ్విస్తున్న ఈ చిత్రాన్ని ఇటీవలె అనిల్ రావిపూడి తన తదుపరి ప్రాజెక్ట్ హీరో అయిన నటసింహం నందమూరి బాలకృష్ణకు చూపించారట. ఆయనకు సినిమా బాగా నచ్చిందట.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే `ఎఫ్ 3` చూసి తర్వాత బాలయ్య.. అనిల్ రావిపూడితో చేయబోయే సినిమా విషయంలో మనసు మర్చుకున్నారట. వాస్తవానికి ఇప్పటి వరకు కామెడీ జానర్ సినిమాలనే చేసిన అనిల్ రావిపూడి.. బాలయ్యతో మాత్రం ఓ యాక్షన్ సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నారు. బాలయ్య ఇమేజ్ను, ఆయన అభిమానుల్ని దృష్టిలో పెట్టుకుని కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంగా స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశారు.
ఇది తండ్రీ కూతురు మధ్య నడిచే కథ కాగా.. ఇందులో బాలయ్య కూతురిగా యంగ్ బ్యూటీ శ్రీలీల అలరించబోతోంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఈ చిత్రాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే `ఎఫ్ 3` చూశాక బాలయ్య పూర్తి యాక్షన్ తో సినిమా వద్దని, నీ మార్క్ తోనే ఈ సారి కూడా ముందుకు వెళ్దామని అనీల్ రావిపూడికి సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో అనిల్ రావిపూడి ఇప్పుడేం చేస్తాడు..? బాలయ్య కోరిక మేరకు స్క్రిప్ట్‌ను మారుస్తాడా..? లేక యాక్షన్ మోడ్‌లోనే వెళ్తాడా..? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!