నటసింహం నందమూరి బాలయ్య బాబు ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క పరాజయం లేని దర్శకుడిగా గోపీచంద్ మలినేనికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. దీంతో బాలయ్యతో చేస్తున్న సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. “NBK 107” టైటిల్ పేరిట తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. కాగా ఇటీవల బాలయ్య బాబు కరోనా బారిన పడటంతో సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది. అయితే కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న బాలయ్య.. కరోనా నుండి కోలుకొని మళ్ళీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు.
తాజాగా ఈ సినిమా షూటింగ్ కర్నూల్ లో కొండారెడ్డి బురుజు సెంటర్ వద్ద జరుగుతుంది. అంతేకాకుండా మౌర్య హోటల్ వద్ద కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. బాలయ్య రావడంతో కర్నూలులో చాలామంది అభిమానులు షూటింగ్ జరిగే ప్రాంతం వద్ద బాలయ్యను చూడటానికి ఎగబడుతున్నారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య చాలా పవర్ ఫుల్ రోల్ చేస్తున్నారు. ఇటీవల సినిమాకి సంబంధించి చిన్నపాటి వీడియో విడుదల చేయటం జరిగింది. భారీ యాక్షన్ సన్నివేశాలు గోపీచంద్ మలినేని తీస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో చిన్న గెస్ట్ రోల్ పాత్రలో మాస్ మహారాజా రవితేజ కనిపించనున్నట్లు టాక్. చాలావరకు రవితేజతో డైరెక్టర్ గోపీచంద్ మలినేని సినిమాలు చేసి విజయాలు సాధించడం జరిగింది. దీంతో ఆ బాండింగ్ తో బాలయ్య సినిమాలో రవితేజనీ చిన్న అతిథి పాత్రలో చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ కర్నూలులో జరుగుతోంది. ఆ తర్వాత షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. “అఖండ” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ రెండవ తారీకు విడుదల చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!