Akhanda: వరస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్య బాబు “అఖండ” సినిమాతో గత ఏడాది డిసెంబర్ మాసంలో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన “అఖండ” బాలయ్య బాబు కెరీర్ లోనే ది బెస్ట్ ఓపెనింగ్ రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టింది. ఏకంగా ఓవర్సీస్ లో కూడా భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన సంగీతం.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్… థియేటర్ లో ప్రేక్షకులనీ దడదడ లాడించింది.
చాలా అద్భుతంగా బాలయ్య బాబుని బోయపాటి శీను చూపించడం జరిగింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన సింహా, లెజెండ్ సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో అఖండ తో హ్యాట్రిక్ విజయం దక్కినట్లు అయ్యింది. దీంతో ఇంత భారీ విజయం “అఖండ” సాధించడంతో… ఈ సినిమా సెంటిమెంట్ గోపీచంద్ మలినేని సినిమాకి వాడాలని బాలయ్య బాబు డిసైడ్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాల లేటెస్ట్ టాక్ వినపడుతోంది.
మేటర్ లోకి వెళ్తే ఈ సినిమా షూటింగ్ తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల జిల్లాలో రేపు స్టార్ట్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా యాక్షన్ ఎపిసోడ్ తో ప్రారంభించాలని బాలయ్య బాబు డైరెక్టర్ కి ముందుగానే చెప్పారట. “అఖండ”కి స్టార్టింగ్ ఫైట్ సీన్ తో…షూటింగ్ స్టార్ట్ చేయడంతో…అదే సెంటమెంట్ గోపీచంద్ మలినేని సినిమాకి కొనసాగించాలని బాలయ్య బాబు డిసైడ్ అయ్యారట. దీంతో రేపు సిరిసిల్ల జిల్లాలో రెగ్యులర్ షూటింగ్ లో భారీ ఫైట్ సీన్ ఏపిసోడ్… ప్రారంభం కానుందట. గోపీచంద్ మలినేని వరుస విజయాలతో ఉండటంతో బాలయ్య బాబు అభిమానులు ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.