Balakrishna – sukumar: బాలయ్య ఇచ్చిన బంపర్ ఆఫర్ సుకుమార్ వాడుకుంటే అభిమానులు నెత్తిన పెట్టుకుంటారు..

Share

Balakrishna – sukumar: నట సింహం నందమూరి బాలకృష్ణ మంచి దూకుడు మీదున్నారు. 100వ సినిమాగా చేసిన గౌతమీ పుత్ర శాతకర్ణితో భారీ సక్సెస్ సాధించిన బాలయ్య ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. కానీ ఆయనకి మళ్ళీ 100 వ సినిమా తర్వాత ఇప్పటి వరకు ఆశించిన భారీ కమర్షియల్ హిట్ దక్కలేదు. దాంతో మరోసారి బోయపాటి శ్రీనుకి అవకాశం ఇచ్చి హ్యాట్రిక్ సినిమా చేశారు బాలయ్య. అఖండ టైటిల్‌తో వచ్చిన బాలయ్య – బోయపాటి శ్రీను హ్యాట్రిక్ సినిమాగా అఖండ విజయాన్ని అందుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా వంద కోట్ల వసూళ్ళు రాబట్టి బాక్సాఫీస్ వద్ద ఇంకా దూసుకుపోతోంది.

balakrishna-gave bumper offer to sukumar-
balakrishna-gave bumper offer to sukumar-

ఈ దూకుడుతో బాలయ్య బ్యాక్ టు బ్యాక్ యంగ్ డైరెక్టర్‌కు అవకాశాలిస్తున్నారు. ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే ప్రారంభమైంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలబోతోంది. దీని తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. అంతేకాదు మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా లైన్‌లో పెట్టబోతున్నారని తాజాగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనికి ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయి. బాలయ్య తెలుగు ఓటీటీ ఆహా కోసం అన్‌స్టాపబుల్ అనే సెలబ్రిటీ షో చేస్తున్నారు. ఈ షోలో ఇండస్ట్రీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తూ ఆకట్టుకుంటున్నారు.

Balakrishna – sukumar: సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేద్దాం అంతే..!

ఇప్పటికే మహేశ్ బాబు, రవితేజ, మోహన్ బాబు, గోపీచంద్ మలినేని లాంటి ప్రముఖులను షోలో పలకరించిన బాలయ్య తాజాగా సుకుమార్, అల్లు అర్జున్‌లతో షో చేశారు. ఈ సమయంలో బాలయ్య సుకుమార్‌కు నేరుగానే బంపర్ ఆఫర్ ఇచ్చారు. పుష్ప పార్ట్ 2 కంప్లీట్ అయ్యాక మనిద్దరం సినిమా చేస్తున్నామని. మూడు నెలల్లో థియేటర్స్‌లో బొమ్మ పడాల్సిందే అంటూ ఉత్సాహపరిచారు. అంతేకాదు వచ్చే ఏడాది దసరాకు కొబ్బరికాయ కొట్టి.. క్రిస్మస్ కు గుమ్మడికాయ కొట్టేద్దాం. 2023 సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేద్దాం అంతే.. అని బాలయ్య సుకుమార్‌తో అన్నారు. దాంతో సుకుమార్ చాలా ఎగ్జైట్ అవుతూ ఓకే సార్ అన్నారు. ఇది షోలో భాగంగా చెప్పినప్పటికీ అభిమానులే కాదు అందరూ నిజం కావాలని కోరుకుంటున్నారు.


Share

Related posts

” జగన్ ప్రజల ప్రాణాలు తీస్తున్నాడు ” అతిపెద్ద ఆరోపణ .. వీడియో ప్రూఫ్ తో సహా ! 

sekhar

శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా

Siva Prasad

అక్కినేని హీరో సినిమాలో భారీ ఆఫర్ అందుకున్న రకుల్ ..!

GRK