Balakrishna: నందమూరి బాలకృష్ణ తోటి హీరోలు.. చిరంజీవి, నాగార్జున ఇంకా పలువురు తమ వారసులను ఆల్ రెడీ ఫీల్డ్ లోకి దింపేశారు. వారసులుగా వచ్చిన చరణ్, నాగచైతన్య.. ఇప్పటికే వారి సత్తా నిరూపించుకున్నారు. తండ్రికి తగ్గ తనయులు అన్న తరహాలో ఇప్పుడు సినిమాలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో బాలకృష్ణ నట వారసుడు నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని నందమూరి ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణ తన 60వ పుట్టినరోజు వేడుకలు సమయంలో పలు చానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కచ్చితంగా మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు.
ఈ ఇంటర్వ్యూలు జరిగి రెండు సంవత్సరాలు కావస్తున్న గాని ఇప్పటివరకు మోక్షజ్ఞ.. సినీ ఎంట్రీ అనేది ఎప్పుడు ఫ్యాన్స్ కి అర్థం కావడం లేదు. మోక్షజ్ఞ ఎంట్రీపై ఎప్పటినుండో చర్చ నడుస్తోంది. ఇదిగో ఈ సినిమాతో వస్తున్నాడు.. ఆ దర్శకుడు పరిచయం చేస్తున్నాడు అంటూ రకరకాల వార్తలు వచ్చాయి. కానీ, దేనిపైనా అధికారిక ప్రకటన రాలేదు. దీంతో కన్ఫ్యూషన్ లో ఉన్న అభిమానులకు తాజాగా బాలయ్య క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఉండనుందని తెలియజేశారు. అయితే దర్శకుడు ఎవరన్నది చెప్పలేదు. ఇక ఇదే సమయంలో బోయపాటి దర్శకత్వంలో గత ఏడాది వచ్చిన “ఆఖండ”కి సీక్వెల్ ఉంటుందని తెలిపారు. బోయపాటి దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఉంటుందా అంటే దానికి బాలకృష్ణ సమాధానం దాటు వేసే అంత దైవేచ్ఛ అని నవ్వారు.
ఇదిలా ఉంటే మరో పక్క మాత్రం కొడుకు మోక్షజ్ఞ అని ఫస్ట్ స్వయంగా దర్శకుడిగా బాలకృష్ణ లాంచ్ చేయనున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. ఆయన ఇటీవల ఆహా “అన్ స్టాపబుల్” షోలో “ఆదిత్య మాక్స్ 999” స్టోరీ రాసుకున్నట్లు తెలియజేయడం జరిగింది. అయితే ఈ స్టోరీ తోనే కొడుకు మోక్షజ్ఞనీ బాలకృష్ణ హీరోగా ప్రేక్షకులకు పరిచయం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.