NBK107: నటసింహం నందమూరి బాలయ్య బాబు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్ లో 107వ సినిమాగా తెరకెక్కుతున్న.. ఈ ప్రాజెక్టు షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. బాలయ్య సరసన మెయిన్ హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. గోపీచంద్ మలినేని లక్కీ హీరోయిన్ గా పేరొందిన శృతిహాసన్.. ఈ సినిమాలో చాలా పెద్ద రోల్ చేస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఐటెం సాంగ్ రీసెంట్ గా డైరెక్టర్ ప్లాన్ చేయడం జరిగిందట.
అయితే ఐటమ్ సాంగ్ లో ప్రేక్షకులను వేడెక్కించే రీతిలో సరి కొత్త హీరోయిన్ ని రంగంలోకి సినిమా యూనిట్ జరుపుతున్నట్లు ఇండస్ట్రీలో సరికొత్త టాపిక్ నడుస్తుంది. పూర్తి విషయంలోకి వెళితే బాలయ్య తో పాటు హాట్ బ్యూటీ డింపుల్ హాయతి స్టెప్స్ వేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రత్యేకంగా ఈ పాట పై శ్రద్ధ పెట్టినట్లు సమాచారం. ఇప్పటికే సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కావటం మాత్రమే కాదు అభిమానులను మరింత ఆకట్టుకుంది. పోస్టర్ బట్టి బాలయ్య ఊర మాస్ క్యారెక్టర్ చేస్తున్నట్లు ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉంటే వచ్చే నెల బాలయ్య పుట్టిన రోజు నేపథ్యంలో గోపీచంద్ మలినేని అభిమానులను సర్ప్రైజ్ చేసే ప్లాన్ చేసినట్లు.. పోస్టర్ లేదా వీడియో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. అంతమాత్రమే కాదు ఈ సినిమాలో బాలయ్య బాబు డబల్ రోల్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో సినిమాలో రెండో హీరోయిన్ గా మలయాళం ఇండస్ట్రీకి చెందిన హాని రోస్ నీ తీసుకోవడానికి సినిమా మేకర్స్ డిసైడ్ అయినట్లు ఇండస్ట్రీలో టాక్ గట్టిగా నడుస్తోంది. ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతూ ఉండటంతో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…
Hero Ram: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీటలెక్కబోతున్నాడంటూ గత కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…
AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…
Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…
Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…
Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…