Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన హ్యాట్రిక్ సినిమా. తాజాగా ఈ సినిమా వందరోజులు పూర్తి చేసుకుంది. శనివారం సాయంత్రం కర్నూలు జిల్లాలో అఖండ వంద రోజులు ఫంక్షన్ చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ సినిమా డైరెక్టుగా నాలుగు కేంద్రాల్లో 100 రోజులు ఆడగా.. షిఫ్టులతో కలుపుకుని 20 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమా ఒక్క కర్నూలు జిల్లాలోనే 3 థియేటర్లలో డైరెక్టుగా 100 రోజులు ఆడింది. ఆదోని – ఎమ్మిగనూరు – కోయిలకుంట్లతో పాటు గుంటూరు జిల్లా చిలకలూరిపేట కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.
ఇక కర్నూలులో జరిగిన అఖండ 100 రోజుల విజయోత్సవ ఫంక్షన్‌లో బాలయ్య మాట్లాడుతూ ఇంత అద్భుతమైన విజయం అందించిన ప్రేక్షక దేవుళ్లు అందరికి కృతజ్ఞతలు తెలియజేశారు. హైందవ సంస్కృతిని, తెలుగు సంప్రదాయాన్ని చాలా గొప్పగా చెప్పిన ఘనత అఖండ సినిమాకే దక్కుతుందన్నారు. ప్రకృతి, మహిళలు, పిల్లలకు అన్యాయం జరిగినప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి వారిని రక్షిస్తాడు అనే సందేశాన్ని తాము ఈ సినిమాలో చూపించామన్నారు.
బోయపాటి శ్రీను, తాను కేవలం డబ్బును దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీయమని.. కట్టె.. కొట్టె.. తెచ్చే అనే మూడు మాటలతోనే సినిమా తీస్తామని.. సందేశాత్మక సినిమాలను ప్రోత్సహిస్తోన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు అని.. రాయలసీమలో తనను అభిమానించే వారు ఎక్కువుగా ఉన్నందున ఇక్కడే అఖండ 100 రోజుల ఫంక్షన్ నిర్వహించామని బాలకృష్ణ అన్నారు.
చరిత్ర సృష్టించాలన్నా మేమే.. చరిత్ర తిరగరాయాలన్నా మేమే. మాకు మేమే పోటీ. సింహాకు పోటీ లెజెండ్, లెజెండ్‌కు పోటీ అఖండ అని.. కరోనా ఉన్నా కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని.. తాము అఖండ షూటింగ్ చేశామని.. సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండి.. బయట కరోనా ఉందన్న విషయం కూడా మర్చిపోయామని బాలయ్య అన్నాడు. ఇక అఖండ దెబ్బకు అమెరికాలో థియేటర్లలో స్పీకర్లు కూడా బద్దలయ్యాయని.. అలాంటి సునామీ అఖండ క్రియేట్ చేసిందని బాలయ్య చెప్పారు.
Varun tej: బాబాయ్ వలనే వెనక్కి తగ్గాను.. లేదంటే బరిలో దిగి కుమ్మేసేవాడిని: వరుణ్ తేజ్