25.7 C
Hyderabad
April 1, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Balakrishna: బాలకృష్ణ అనిల్ రావిపూడి సినిమాలో లేడీ విలన్ పాత్రలో బాలీవుడ్ నటి..!!

Share

Balakrishna: నటసింహం నందమూరి బాలయ్య బాబు కెరియర్ విజయవంతంగా కొనసాగుతోంది. 2021 అఖండ రాకముందు వరకు బాలయ్య అనేక పరాజయాలు ఎదుర్కోవటం జరిగింది. కానీ అఖండ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కటం జరిగింది. ఈ సినిమా ద్వారా బోయపాటితో బాలకృష్ణ హ్యాట్రిక్ విజయం సాధించారు. ఆ తర్వాత ఆహా ఓటీటీలో “అన్ స్టాపబుల్” షో తో నందమూరి అభిమానులకు మాత్రమే కాక మిగతా హీరోల అభిమానులకు కూడా దగ్గర అయిపోయారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి పండుగకు వీర సింహారెడ్డి తో బాలయ్య బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకోవడం తెలిసిందే. కాగా ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అయ్యారు.

Balakrishna is a Bollywood actress who played the role of a lady villain in Anil Ravipudi's movie

“వీరసింహారెడ్డి”లో రాయలసీమ నేపథ్యం కలిగిన పాత్ర చేసిన బాలయ్య అనిల్ రావిపూడి సినిమాలో తెలంగాణ ప్రాంతానికి చెందిన యాసతో డైలాగులు పలకనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా మరి కొద్ది రోజుల్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమాలో బాలయ్య కూతురు పాత్రలో యంగ్ హీరోయిన్ శ్రీ లీలా నటిస్తున్నట్లు టాక్. ఇంకా బాలయ్యకి జోడిగా కాజల్ అగర్వాల్ కనిపించనుందట. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలీవుడ్ నటి నోరా ఫతేహి విలన్ పాత్రలో కనిపించనుందట.

Balakrishna is a Bollywood actress who played the role of a lady villain in Anil Ravipudi's movie

గతంలో రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన “బాహుబలి” సినిమాలో ఐటమ్ సాంగ్ లో స్టెప్పులేసింది. అయితే ఇప్పుడు అనిల్ రావిపూడి బాలకృష్ణ పాత్రలో నెగటివ్ రోల్ లో కనిపించనుందట. చాలా పవర్ ఫుల్ షేడ్స్ కలిగిన క్యారెక్టర్ నోరా ఫతేహి కీ ఇవ్వటం జరిగిందట. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేసి దసరా పండుగకు సినిమా విడుదల అయ్యేలా అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.


Share

Related posts

ఆ హీరో టార్గెట్ చిరంజీవేన‌ట‌..!

Siva Prasad

RC15: మరోసారి రాజమండ్రిలో అడుగుపెట్టిన రామ్ చరణ్ తేజ్..!!

sekhar

అయ్యో.. క్రియేటివిటీ పోయిందా

Siva Prasad