29.2 C
Hyderabad
March 21, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Balakrishna: ఆహాలో మరో షోలో సందడి చేయబోతున్న బాలకృష్ణ..!!

Share

Balakrishna: నటసింహం నందమూరి బాలయ్య బాబుకీ ఆహా ఓటిటిలో “అన్ స్టాపబుల్” టాకీ షో విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చింది. బాలయ్యలో ఉన్న కొత్త కోణాన్ని ఈ షో సరికొత్తగా ఆవిష్కరించింది. “అన్ స్టాపబుల్” షో స్ట్రీమింగ్ కాకముందు… బాలయ్య బాబుని కేవలం హీరోగా మాత్రమే అభిమానించే ఫ్యాన్స్ ఉండేవారు. కానీ ఈ షో తర్వాత…హోస్ట్ గా… అంతకుముందు బాలయ్య అనే విభేదించేవారు సైతం అభిమానించడం జరిగింది. బాలయ్య బాబు తన యాంకరింగ్ ద్వారా విమర్శకులను సైతం అభిమానులుగా మార్చేసుకున్నారు. తనలో ఉన్న చిలిపితనాన్ని… ఈ షో ద్వారా ఎంటర్టైన్మెంట్ రూపంలో పండిస్తూ బాగా ఆకట్టుకున్నారు. ఈ షోకి వచ్చే చాలామంది టాప్ మోస్ట్ సెలబ్రిటీలను… తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేస్తూ అద్భుతంగా రెండు సీజన్లు సక్సెస్ అయ్యేలా బాలయ్య వ్యవహరించారు.

Balakrishna is going to make noise in another show in Aha

అన్ స్టాపబుల్ మొదటి సీజన్ లో సినిమా సెలబ్రిటీలు వస్తే రెండవ సీజన్ లో సినిమా సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు రావడం జరిగింది. జనవరి నెలలో రెండవ సీజన్ కంప్లీట్ అయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆహాలో మరో షోలో.. బాలయ్య కనిపించడానికి రెడీ అయ్యారు. పూర్తి విషయంలోకి వెళ్తే “తెలుగు ఇండియన్ ఐడీల్స్ 2″ కార్యక్రమంలో బాలకృష్ణ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ…”ఇంతకు ముందేన్నాడు చూడని బాలయ్యను చూస్తారు” అని ఆహా టీం ట్వీట్ చేసింది.

Balakrishna is going to make noise in another show in Aha

ఈనెల 17 మరియు 18 తారీకులలో ఈ కార్యక్రమం ప్రసారం కానున్నట్లు స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఆహా టీం రిలీజ్ చేసిన బాలయ్య లుక్ కీ ఫాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుంది. శ్రీ లీల బాలయ్య కూతురుగా నటిస్తోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. దసరాకి ఈ సినిమా విడుదల చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉంది.


Share

Related posts

Keerthy Suresh Latest Photos

Gallery Desk

పవన్ కోసం హీరోయిన్ ని ఫిక్స్ చేసిన సురేందర్ రెడ్డి..!!

sekhar

Intinti Gruhalakshmi 25 August: నందు మిగిల్చిన బాధను.. సామ్రాట్ సంతోషంతో నింపేసాడా..!

bharani jella