నందమూరి బాలకృష్ణ చేస్తున్న సినిమాలు గత కొంత కాలం నుండి వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ బయోపిక్ సినిమా తర్వాత వచ్చి “రూలర్” ఇంకా కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. దీంతో నందమూరి అభిమానులు ఎంతగానో నిరాశ లో ఉన్నారు. ఇటువంటి తరుణంలో బోయపాటి… బాలయ్య తో సినిమా అని అనౌన్స్ చేసి బాలయ్య ఫ్యాన్స్ లో జోష్ నింపారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి 13 రోజుల షూటింగ్ పూర్తి చేసుకోవడం జరిగింది.
ఆ తర్వాత కరోనా వైరస్ రావటం లాక్ డౌన్ విధించడంతో సినిమా షూటింగ్ లు మాత్రం ఆగిపోవడం జరిగింది. అన్ని సినిమా షూటింగుల తో పాటు బోయపాటి శ్రీను సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. దీంతో లాక్ డౌన్ సమయంలో…ఖాళీ టైం ఎక్కువ దొరకటంతో పాటు ప్రస్తుత పరిస్థితులు బట్టి… అనుకూలంగా ఉన్న వాతావరణాన్ని బట్టి బోయపాటి సరైన షార్ట్ షెడ్యూల్ ప్రిపేర్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్. వాస్తవానికి వారణాసిలో చాలా పెద్ద షెడ్యూల్ ఈ సినిమా కోసం బోయపాటి రెడీ చేశాడట.
కానీ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా పరిస్థితి అంతగా అనుకూలంగా లేకపోవడంతో… అలాంటి సెట్ హైదరాబాదులోనే వేసి తక్కువ టైంలో సినిమా షూటింగ్ పూర్తి చేయటానికి బోయపాటి రెడీ అయినట్లు మీడియాలో వార్తలు వినబడుతున్నాయి. ఇదిలావుండగా ఈ సినిమా టైటిల్ బోయపాటి ఇంకా ఫిక్స్ చేయలేదు. వినబడుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కి మోనార్క్, సూపర్ మాన్… ఇంకా కొన్ని పేరు మొన్నటి వరకు వచ్చాయి. కానీ వచ్చిన పేర్లలో వాస్తవం లేదని సినిమా యూనిట్ తేల్చేసింది. పూర్తి మేటర్ లోకి వెళ్తే ఈ సినిమాకి “డేంజర్” అనే టైటిల్ ఖరారు చేసినట్లు ఇండస్ట్రీలో టాక్.
టైటిల్ కి తగ్గట్టే స్క్రిప్ట్ ఉంటుందని…. బాలయ్య క్యారెక్టర్ ఉంటుందని సినిమా యూనిట్ నుండి అందుతున్న సమాచారం. బాలయ్య కి కరెక్ట్ గా సెట్ అయ్యే సినిమా ఇదే అని… బోయపాటి “డేంజర్” అనే టైటిల్ పెట్టాలని ఫుల్ గా డిసైడ్ అయినట్లు సమాచారం. ఇప్పటికే సింహ, లెజెండ్ లాంటి రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వచ్చి బ్లాక్ బస్టర్ విజయాలు అయ్యాయి.
అయితే తాజాగా రాబోతున్న ఈ మూడో సినిమా తో హ్యాట్రిక్ విజయం సాధించాలని, బాలయ్య అభిమానులకు మరో గిఫ్ట్ గా ఇవ్వాలని బోయపాటి ఫుల్ గా డిసైడ్ అయ్యారట. సెప్టెంబర్ నెల నుండి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందట. బాలయ్య ఫ్యాన్స్ తమ అభిమాన హీరో ఎలా ఉండాలో…. అని ఎదురుచూస్తున్నారో ఆ విధంగా ఈ సినిమా ఉంటుందని, ఇండస్ట్రీలో సినిమా యూనిట్ నుండి వినబడుతున్న టాక్.