NBK107: పండగ కంటే ముందే వచ్చేస్తున్న బాలయ్య సినిమా..??

Share

NBK107: వరుస పరాజయాలతో ఉన్న బాలయ్య బాబు(Balakrishna) గత ఏడాది బోయపాటి దర్శకత్వంలో “అఖండ” (Akhanda)తో విజయం సాధించి మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కటం తెలిసిందే. అఖండ విజయంతో .. బోయపాటితో బాలయ్య బాబు హ్యాట్రిక్ కొట్టడం జరిగింది. కాగా ప్రస్తుతం గోపీచంద్ మలినేని(Gopichand Malineni) దర్శకత్వంలో “NBK 107” చేస్తున్నారు. సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న సమయంలో ఇటీవల బాలయ్య బాబు కరోనా బారినపడటం తెలిసిందే. దీంతో “NBK 107” విడుదల ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నట్లు లేటెస్ట్ గా వార్తలు రావడం జరిగాయి.

సంక్రాంతి పండుగకు వస్తున్నట్లు.. ప్రజెంట్ టాప్ నడుస్తోంది. ఇటువంటి తరుణంలో సినిమా యూనిట్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం సంక్రాంతి కంటే ముందుగానే డిసెంబర్ నెలలో గోపీచంద్ మళ్లీనేని విడుదల చేయాలని డిసైడ్ అయ్యారట. గత ఏడాది “అఖండ” డిసెంబర్ నెలలోనే విడుదల అయ్యి ప్రభంజనం సృష్టించింది. ఆ సెంటిమెంట్ పరంగా… డిసెంబర్ నెలలో విడుదల చేయాలని బాలయ్య కూడా ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.

రాయలసీమ నేపథ్యంలో.. తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల బాలయ్య బాబు పుట్టినరోజు నాడు “NBK 107″కి సంబంధించి విడుదలైన వీడియో.. అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. గోపీచంద్ మళ్లీనేనీ టేకింగ్..కి.. బాలయ్య బాబు యాక్షన్ కి.. ఈ వీడియో చూసి అభిమానులకి సినిమాపై మరింతగా అంచనాలు నెలకొన్నాయి. మరి డిసెంబర్ నెలలో వస్తున్న ఈ సినిమా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. కాగా ప్రస్తుతం బాలయ్య బాబు కరోనా నుండి కోలుకున్నట్లు.. నెగిటివ్ రిపోర్టు వచ్చినట్లు సమాచారం. దీంతో వచ్చే వారం నుండి మళ్లీ షూటింగ్ లలో బాలయ్య బాబు జాయిన్ కానున్నట్లు ఇండస్ట్రియల్ టాక్.


Share

Recent Posts

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

43 నిమిషాలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

47 నిమిషాలు ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

1 గంట ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago

నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పిని తగ్గించే డ్రింక్స్..!

ప్రతి స్త్రీ యొక్క జీవితంలో పీరియడ్స్ రావడం అనేది సాధారణ ప్రక్రియ. అలాగే స్త్రీ యోక్క ఆరోగ్యం విషయంలో కూడా పీరియడ్స్‌ కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి…

2 గంటలు ago

“SSMB 28” ఆలస్యం కావడానికి కారణం అదేనట..??

"SSMB 28" వర్కింగ్ టైటిల్ తో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు ఈ ఏడాది…

3 గంటలు ago