నరసింహం నందమూరి బాలయ్య బాబు “అఖండ” సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కటం తెలిసిందే. గత ఏడాది విడుదలైన “అఖండ” బాలకృష్ణ కెరియర్ లోనే అత్యంత హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. పైగా పాండమిక్ టైంలో కలెక్షన్లు అత్యధికంగా వసూలు రాబట్టడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మల్లినేని ఇంకా అనిల్ రావిపూడితో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేనితో చేస్తున్న సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
“క్రాక్” సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోవటంతో.. గోపీచంద్ దర్శకత్వంలో వస్తున్న సినిమాపై బాలయ్య ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. “NBK 107” వర్కింగ్ టైటిల్ తో తరికేకుతున్న ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ వీడియో బాలయ్య పుట్టినరోజు నాడు విడుదల చేసి సినిమాపై అంచనాలు మరింతగా అమాంతం పెంచేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్స్ ఒకటి “జై బాలయ్య” అని మరొకటి “రెడ్డి గారు” అని ఇండస్ట్రీలో బాలయ్య పవర్ ఫుల్ టైటిల్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక అనిల్ రావిపూడి సినిమాకి సంబంధించి “NBK 108” వర్కింగ్ టైటిల్ పెట్టడం తెలిసిందే. అయితే ఈ సినిమాకి “ఐ డోంట్ కేర్” అనే టైటిల్ పెట్టే ఆలోచనలు అనిల్ రావిపూడి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ మూడు టైటిల్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే గోపీచంద్ మల్లి నేను దర్శకత్వంలో చేస్తున్న సినిమా వచ్చే సంక్రాంతి అనుకున్న కానీ వేసవికి వెళ్లే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇండస్ట్రీలో షూటింగ్ లు బంద్ కావటంతో .. సినిమా రిలీజ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు టాక్.
Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!