Subscribe for notification
Categories: సినిమా

NBK 109: స్పీడ్ పెంచిన బాలయ్య.. మూడో సినిమా కూడా సెట్..??

Share

NBK 109: నటసింహం నందమూరి బాలయ్య బాబు “అఖండ” సినిమా విజయంతో మంచి జోరు మీద ఉన్న సంగతి తెలిసిందే. అఖండ తర్వాత వెంటనే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా ఓకే చేయగా ఆ తర్వాత డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ కూడా ఓకే చేయటం మనకందరికీ తెలుసు. అయితే ఇప్పుడు రెండో సినిమా అనిల్ రావిపూడి ప్రాజెక్టు మొదలు కాకముందే మూడో సినిమా కూడా బాలయ్య సెట్ చేసినట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో నడుస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే రచయితగా బీవీఎస్ రవి ఇండస్ట్రీలో మంచి పేరు ఉన్న సంగతి తెలిసిందే.

ఇటీవల ఆయన పనిచేసిన చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. వాంటెడ్, జవాన్ మాత్రమే ఆయన దర్శకత్వం వహించిన సినిమాలలో ఫ్లాప్ కావడం జరిగాయి. ఇదిలావుంటే ఇటీవల బీవీఎస్ రవి బాలయ్య బాబుకు ప్రత్యేకంగా స్టోరీ వినిపించినట్లు టాక్. అయితే మొదటి సిట్టింగ్ లోనే బాలయ్య కి స్టోరీ బాగా నచ్చటంతో మూడో సినిమాగా.. రవితో చేయడానికి బాలయ్య రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో ఆహా ఓటిటి లో బాలయ్య హోస్ట్ గా చేసిన “అన్ స్తాపబుల్” షోనీ బీవీఎస్ రవి యే డిజైన్ చేయటం జరిగింది. దీంతో ఆ పరిచయంతో ఇటీవల బాలయ్యకి కథ వినిపించగా ఆయన ఓకే చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.

ప్రస్తుతం బాలయ్య బాబు.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాయలసీమ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో బాలయ్య సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. దసరా పండుగకు ఈ సినిమా విడుదల చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉంది. ఆ తర్వాత వెంటనే అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ లో బాలయ్య జాయిన్ కానున్నారు. ఈ సినిమాలో బాలయ్య బాబుని చాలా డిఫరెంట్ గా అనిల్ రావిపూడి చూపించనున్నాడు. ఈ రెండు ప్రాజెక్టులు అయిన వెంటనే బీవీఎస్ రవి ప్రాజెక్ట్ బాలయ్య మొదలు పెట్టే అవకాశాలు ఉన్నట్లు త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.


Share
sekhar

Recent Posts

pushpa 2: `పుష్ప 2`లో న‌టించాల‌నుందా..? అయితే ఇదిగో బిగ్ ఆఫ‌ర్‌!

pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న పాన్…

17 mins ago

Hero Yash: పాన్ ఇండియా నిర్మాతల వేటలో హీరో యశ్

Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…

47 mins ago

Pakka Commercial: `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌` ఓటీటీ రైట్స్ ధ‌రెంతో తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ మారుతి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`.…

1 hour ago

Sudigali Sudheer : సుధీర్‌పై నాగబాబు సెటైర్లు.. మళ్లీ ఒకే చోట చేరిన గ్యాంగ్..

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…

2 hours ago

Rashmika: కెరీర్‌లో పెద్ద టర్నింగ్‌ పాయింట్ ఆ సినిమానే అంటున్న ర‌ష్మిక‌!

Rashmika: నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఛ‌లో`తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి అన‌తి…

2 hours ago

Pears: తప్పనిసరిగా తినాల్సిన పండు ఇది..!

Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…

2 hours ago