నందమూరి బాలకృష్ణ 105వ చిత్రం `రూలర్`. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా
డిసెంబర్ 20న విడుదలవుతుంది. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు షేడ్స్‌లో కనపడనున్నారు. ఈ రెండు షేడ్స్‌కు సంబంధించిన లుక్స్ విడుదలయ్యాయి. కాగా రీసెంట్గా మరో లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. బాలకృష్ణ గోల్ఫ్ ఆడుతున్న ఈ లుక్‌లో బాలయ్య స్టైలిష్‌గా, యంగ్ లుక్‌లో కనపడుతున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జైసింహా తర్వాత అదే కాంబినేషన్లో వస్తున్న చిత్రమిది. వేదిక, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.