నందమూరి బాలకృష్ణ 105వ చిత్రం `రూలర్` సినిమా షూటింగ్ దశలో ఉంది. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. డిసెంబర్ 20న ఈ సినిమాను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. నవంబర్ 6 నుండి చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరగనుందట. కొడైకెనాల్లో ఈ షెడ్యూల్‌ను చిత్రీకరిస్తారట. ఈ షెడ్యూల్ సన్నివేశాలను ష్లాష్ బ్యాక్‌లో చూడొచ్చు. ఈ షెడ్యూల్ చిత్రీకరణతో మేజర్ చిత్రీకరణ పూర్తవుతుందట. సోనాల్‌చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య రెండు షేడ్స్‌లో నటిస్తున్నాడు. అందులో ఒకటి పోలీస్ ఆఫీసర్ రోల్ కాగా.. మరో పాత్ర మాఫియా డాన్ పాత్ర అని టాక్.
previous post