33.7 C
Hyderabad
March 31, 2023
NewsOrbit
సినిమా

Akhanda Silver Jubliee: అఖండ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు..!!

Share

Akhanda Silver Jubliee: నటసింహం నందమూరి బాలయ్య బాబు.. మాస్ పల్స్ స్పెషలిస్ట్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో గత ఏడాది వచ్చిన “అఖండ” బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఇటీవల తాజాగా కర్నూలులో 175 రోజులు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుక కర్నూలులో “అఖండ” సినిమా యూనిట్ ఘనంగా నిర్వహించింది. డైరెక్టర్ బోయపాటి అదే విధంగా హీరో బాలయ్య బాబు మిగతా సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు.

balakrishna sensational speech in Akhanda Silver Jubliee function

ఈ సందర్బంగా బాలయ్య బాబు మాట్లాడుతూ “అఖండ” సినిమా… ఇండస్ట్రీకి నిరీక్షణ కలిగించిన సినిమా అని స్పష్టం చేశారు. పార్టీలకు, ప్రాంతలకు… కులమతాలకు అతీతంగా ఈ సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ జన్మలో వెలకట్టలేని అభిమానాన్ని సంపాదించుకోవటం ..ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే ఈ స్థితిలో ఉంటామని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. చరిత్ర రాయాలన్నా మేమే… చరిత్ర సృష్టించాలి అన్న మేమే.. మీలాంటి అభిమానులు ఉన్నందుకు చాలా గర్వపడుతున్నామని బాలకృష్ణ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.

అభిమానులు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం అన్న క్యాంటీన్లు తీసివేస్తే ఇటీవల అభిమానులంతా పేదవాళ్లకు అన్న క్యాంటీన్ లు అందుబాటులోకి తీసుకువచ్చే రీతిలో వ్యవహరించారు. నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు.. ఈ విషయంలో ముందుకు వస్తున్నారు అందుకుగాను కృతజ్ఞతలు. అభిమానులు ఎప్పుడూ నాన్న గారి స్ఫూర్తితో రాజకీయాలకతీతంగా.. చేస్తున్న సేవలకు కృతజ్ఞతలు. సినిమాని ఇంతగా ఆదరించి… విజయం అందించినందుకు ప్రేక్షక దేవుళ్ళకు యాజమాన్యానికి కృతజ్ఞతలు అని బాలకృష్ణ తన ప్రసంగాన్ని ముగించారు.


Share

Related posts

Kajal Aggarwal Latest Gallerys

Gallery Desk

‘అయ్యప్పన్‌ కొషియమ్‌’ లో పవర్ స్టార్, మెగా పవర్ స్టార్ లని నటించమని చెప్పిన వాళ్ళు సూపర్.. !

GRK

పవన్ కళ్యాణ్ – రానా సినిమా మొదలవ్వాలంటే సాయి పల్లవి రావాలి ..?

GRK