NewsOrbit
Entertainment News సినిమా

Balakrishna: లైవ్ లో సాంగ్ పాడి అందరిని ఒక్కింత షాక్ కి గురిచేసిన బాలకృష్ణ..!!

Share

Balakrishna: నటసింహం నందమూరి బాలయ్య బాబు టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మాస్ ఫాలోయింగ్ కలిగిన హీరోలలో మొదటి వరుసలో ఉన్న హీరో బాలయ్య బాబు. ఎటువంటి పాత్ర అయినా చేయటంలో బాలయ్య తీరే వేరు. పౌరాణికం.. పాత్రలు చేయాలంటే ప్రస్తుతరంలో బాలకృష్ణనీ మించిన హీరో మరొకరు లేరని చెప్పవచ్చు. 2021 ముందు వరకు బాలయ్య సినిమా కెరియర్ వరుస పరాజయాలతో సతమతమవుతున్న పరిస్థితి. 2021 చివరిలో “అఖండ” సినిమాతో బాలయ్య అదిరిపోయే విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత ఈ ఏడాది ప్రారంభంలో “వీర సింహారెడ్డి” సినిమాతో సంక్రాంతికి మరో హిట్ అందుకోవడం జరిగింది.

Balakrishna shocked everyone by singing the song live

గత ఏడాది “అన్ స్టాపబుల్” అనే టాకీ షో ద్వారా ఆహా ఓటీటీలో అలరించడం జరిగింది. ఫస్ట్ టైం బాలకృష్ణ టాకీ షోలో హోస్ట్ గా అందరినీ ఆకర్షించడం జరిగింది. దీంతో దేశంలోని “అన్ స్టాపబుల్” అనే టాకీ షో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. బాలయ్య టాలెంట్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. అప్పటివరకు నటుడిగా మాత్రమే చూసినా ప్రేక్షకులు యాంకర్ గా తనలో ఉన్న కొత్త కోణాన్ని అద్భుతంగా బాలయ్య ఈ షో ద్వారా ఆవిష్కరించడం జరిగింది.

Balakrishna shocked everyone by singing the song live

ఇదిలా ఉంటే లేటెస్ట్ గా బాలయ్య లైవ్ లో పాట పాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. మేటర్ లోకి వెళ్తే దివంగత నందమూరి తారక రామారావు శతజయంతి దినోత్సవాలు సంవత్సరం పాటు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా కత్తర్ లో దోహలో జరిగిన వందేళ్ళ ఎన్టీఆర్ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ స్టేజిపై దివంగత ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించిన పాటలను అవలీలగా లైవ్ లో వాడటంతో ఈ కార్యక్రమానికి వచ్చిన వారంతా నిలబడి చప్పట్లు కొట్టి అభినందించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 


Share

Related posts

Shivani Narayanan Recent Looks

Gallery Desk

Rashmika mandanna: మాస్‌ను అట్రాక్ట్ చేస్తున్న రష్మిక మందన్న సిగ్నేచర్ స్టెప్..

GRK

బాలీవుడ్ సంగీత దర్శకుడు ఖయ్యం ఇక లేరు

Siva Prasad