సినిమా

Balakrishna-Mahesh Babu: బాల‌య్య చిన్న కోరిక.. మ‌రి మ‌హేష్ బాబు నెర‌వేరుస్తాడా..?

Share

Balakrishna-Mahesh Babu: న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం హోస్ట్‌గా చేస్తున్న షో `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే`. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ `ఆహా`లో ప్ర‌సారం అవుతున్న ఈ షో తొలి సీజ‌న్ త్వ‌ర‌లోనే పూర్తి కాబోతోంది. ఇప్ప‌టికే ఈ టాక్ షోలో టాలీవుడ్‌కి చెందిన ప్ర‌ముఖులెంద‌రో పాల్గొన‌గా.. చివ‌రి ఎపిసోడ్‌కు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు గెస్ట్‌గా విచ్చేశారు.

ఈ ఎపిసోడ్ ఫిబ్ర‌వ‌రి 4న ప్ర‌సారం కానుంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఆహా టీమ్ ప్రోమోను విడుద‌ల చేయ‌గా.. ప్ర‌స్తుతం ఇది నెట్టింట వైర‌ల్‌గా మారింది. మ‌హేష్ బాబును ఓవైపు ఆట‌ప‌ట్టిస్తూనే.. మ‌రోవైపు ఆయ‌న సీక్రెట్స్‌ను బ‌య‌ట‌కు లాగేందుకు బాల‌య్య గ‌ట్టిగానే ప్ర‌య‌త్నించార‌ని ప్రోమో బ‌ట్టీ అర్థం అవుతోంది.

ముఖ్యంగా మహేష్ బాబు నెంబర్ వన్ స్థానం లో కొనసాగుతున్న రోజుల్లో మూడు సంవత్సరాలు గ్యాప్ ఎందుకు తీసుకోవాల్సి వ‌చ్చింది, గ‌ప్‌చుప్‌గా న‌మ్ర‌త‌ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు, వంటి విష‌యాల‌పై బాల‌య్య మ‌హేష్‌ను సూటిగానే ప్ర‌శ్నించాడ‌ని ప్రోమోలో తెలుస్తోంది.

అలాగే ప్రోమోలో బాల‌య్య‌.. `నాదో చిన్న కోరిక..నా డైలాగ్ నీ గొంతులో వినాలని వుంది` అని అన‌డంతో.. అందుకు మ‌హేష్ `మీ డైలాగ్ మీరు తప్ప ఇంకెవరూ చెప్పలేరు సార్` అంటూ బ‌దులిచ్చాడు. మ‌రి బాలయ్య చిన్న కోరిక‌ను మ‌హేష్ నెర‌వేరుస్తాడో.. లేదో.. తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వ‌చ్చే వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే. మొత్తాన్ని అదిరిపోయిన తాజా ప్రోమో.. ప్రేక్ష‌కుల‌కు విశేషంగా ఆక‌ట్టుకుంటోంది.


Share

Related posts

Priyamani : ఇది నాకు ఛాలెంజింగ్ పాత్ర … ప్రియమణి

GRK

ఆదిపురుష్ లో అనన్య పాండే కి కూడా ఛాన్స్ ఉందా ..?

GRK

చిరంజీవి నట విశ్వరూపం.. ‘సైరా..’కు ఏడాది పూర్తి..

Muraliak
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar