Unstoppable: బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న అండ్ స్టాపబుల్ సీజన్ 2 కి ప్రభాస్ తో పాటు గోపీచంద్ కూడా కలిసి వచ్చిన సంగతి తెలిసిందే.. ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. అయితే మరో రెండు రోజుల్లో ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుందనుకుంటే.. ఆహా టీం వాళ్ళు ప్రభాస్ అభిమానులకు డబల్ ట్రీట్ ఇస్తున్నారు.. అయితే ఇదంతా డబ్బుల కోసమేనా అంటూ మరి కొంతమంది విమర్శిస్తున్నారు.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే అన్ స్టాపబుల్ షో సరికొత్తగా ఓకే ఎపిసోడ్ ను రెండు భాగాలుగా చూపించడానికి సిద్ధమయ్యారు. అయితే ఒక్కొక్క ఎపిసోడ్ కు కొద్ది రోజుల గ్యాప్ కూడా ఇస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా విడుదల చేస్తుంది. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ ఎపిసోడ్ ను బాహుబలి సినిమా లాగానే ఈ ఎపిసోడ్ ని కూడా రెండు పాటలుగా విడుదల చేయనున్నట్లు ఆహా టీం అధికారికంగా ప్రకటించింది. ముందుగా బాహుబలి ఎపిసోడ్ పార్ట్ వన్ బిగినింగ్ అండ్ డిసెంబర్ 30వ తేదీన స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు.
ప్రభాస్ ఎపిసోడ్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉండటం వలన ఎక్కడ కూడా ఎడిట్ చేయవద్దు అని ఆహా ఈ నిర్ణయం తీసుకుందట. దీంతో ఎపిసోడ్ షూటింగ్ మొత్తాన్ని కూడా ఎక్కడ డిలీట్ చేయకుండా స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు సమాచారం. బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 2 ది కంక్లూజన్ అనే టైటిల్ తో నెక్స్ట్ ఎపిసోడ్ ను 2023 జనవరి 6వ తేదీన స్ట్రీమింగ్ చేయనున్నారు. కంటెంట్ ఇంత బాగుంది అంటే ఎడిట్ చేయడానికి ఎవరూ ఒప్పుకోలేదు. అదే ఎక్స్ క్లూజివ్ ఎక్స్ పీరియన్స్ మీకు అందించేందుకు డైరెక్ట్ గా స్ట్రీమింగ్ చేయడానికి ఈ రెండు భాగాలు విడుదల చేయబోతున్నట్లుగా ఆహా అధికారికంగా తెలియజేసింది. మాహిష్మతి ఊపిరి పీల్చుకో అంటూ బాహుబలి రెండు భాగాలుగా రాబోతోంది అని అనౌన్స్ చేశారు. దీంతో ఈ ఇయర్ తో పాటు సంక్రాంతి కూడా ఆహాకు భారీ స్థాయిలో క్రేజ్ అందే అవకాశం ఉన్నట్లు అనిపిస్తోంది.. ఆహా టీమ్ కూడా ఈ విధ్మంగా ప్రభాస్ క్రేజ్ ను క్యాష్ చేసుకుంటుందని టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా ప్రభాస్ ఫ్యాన్స్ కి మాత్రం డబుల్ ట్రీట్ ఇస్తున్నారు అది చాలు..
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!