Unstoppable: ఆహా ఓటిటిలో “అన్ స్టాపబుల్” సీజన్ 3 టాకీ షో ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదటి రెండు సీజన్స్ ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. బాలయ్య వ్యాఖ్యాతగా సినిమా హీరోని మించిపోయారు. మొదటి సీజన్ లో కేవలం సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు రావడం జరిగింది. రెండవ సీజన్ లో సినిమా సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మూడవ సీజన్ మొదటి ఎపిసోడ్ లో “భగవంత్ కేసరి” సినిమా యూనిట్ ఎంట్రీ ఇచ్చి అందరిని ఆకట్టుకుంది. బాలకృష్ణ సినిమా కావటంతో ఆ ఎపిసోడ్లో రచ్చ రచ్చ చేశారు. డైరెక్టర్ అనిల్ రావిపూడితో పాటు హీరోయిన్ శ్రీ లీల షోకి రావడం జరిగింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ షోకి రెండో ఎపిసోడ్ లో బాలీవుడ్ “యానిమల్” మూవీ టీం రాబోతుందట. దీనిలో భాగంగా హీరో రణబీర్ కపూర్, రష్మిక మందనతో పాటు సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ జ్యోతి వస్తున్నట్లు సమాచారం. అయితే మూడో సీజన్ గత రెండు సీజన్లకు భిన్నంగా… కేవలం ప్రమోషన్స్ కే పరిమితమైందా అనే కామెంట్లు వస్తున్నాయి. కొత్త సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు చెందిన వాళ్లే వస్తున్నారని ఆడియోన్స్ అంటున్నారు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వస్తున్న “యానిమల్” సినిమాలో హీరో రణబీర్ కపూర్ చాలా వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తున్నారు.
తండ్రి కొడుకుల నేపథ్యంలో సినిమాని భావోద్వేగాలపరంగా.. కొత్త ఎలిమెంట్స్ జోడించి చిత్రీకరించినట్టు సమాచారం. ఈ సినిమాలో రణబీర్ కపూర్ తండ్రిగా అనిల్ కపూర్ నటిస్తున్నాడు. డిసెంబర్ మొదటి తారీకు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషలలో విడుదల కాబోతోంది. ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగ తెలుగులో తీసిన అర్జున్ రెడ్డి హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి రెండు చోట్ల అదిరిపోయే విజయాలు అందుకోవటం జరిగింది. దీంతో తెలుగు ప్రమోషన్స్ లో భాగంగా “అన్ స్టాపబుల్” షోకి యానిమల్ మూవీ యూనిట్ రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.