29.2 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Balakrishna: “వేద” ప్రీ రిలీజ్ వేడుకలో శివరాజ్ కుమార్ పై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు..!!

Share

Balakrishna: కన్నడ హీరో శివరాజ్ కుమార్ తన సొంత బ్యానర్ లో “వేద” అనే సినిమాని తెరకెక్కించడం జరిగింది. కన్నడలో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. హర్ష దర్శకత్వంలో గత ఏడాది డిసెంబర్ 23వ తారీకు విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించటంతో తెలుగులో ఈ సినిమాని ఫిబ్రవరి 9వ తారీఖున విడుదల చేస్తున్నారు. శివరాజ్ కుమార్ కి ఇది 125 సినిమా. దీంతో సంఖ్యాపరంగా మంచి ప్రాధాన్యత సంపాదించుకోవడంతో.. తెలుగులో విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకీ నటసింహం నందమూరి బాలయ్య బాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపై బాలయ్య మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Balakrishna's sensational comments on Shivraj Kumar at vedha pre release event

“కన్నడ మరియు తెలుగు భాషల అనుబంధం గురించి తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. రెండు భాషలకు ఎటువంటి అనుబంధం ఉందో అదే మాదిరి శివరాజ్ కుమార్ కుటుంబంతో తమకు అనుబంధం ఉందని తెలియజేశారు. రాజ్ కుమార్ వారసత్వాన్ని ఎంతో బాధ్యతగా శివరాజ్ కుమార్ ముందుకు తీసుకెళుతున్నారని ప్రశంసించారు. ఇది వారి తల్లిదండ్రులు చేసుకున్న అదృష్టం అని కూడా చెప్పుకోవచ్చు అని స్పష్టం చేశారు. గతంలో “మఫ్టీ” అనే సినిమాని చేయడం జరిగింది.

Balakrishna's sensational comments on Shivraj Kumar at vedha pre release event

ఆ సినిమాలో లుక్కు సరిగ్గా వీరసింహారెడ్డి సినిమాలో ఓల్డ్ పాత్ర లుక్కు ఎలా ఉండాలన్న ప్రస్తావన వచ్చినప్పుడు… మఫ్టీ సినిమాలో శివరాజ్ కుమార్ లుక్కు మాదిరిగా ఉండాలని సూచించడం జరిగింది. వెంటనే ఆ ఫోటోలు తెప్పించి చూపించడంతో నేను ఓకే చెప్పేశాను. ఇక “వేద” సినిమాలో గానవి… అదితి సాగర్ చాలా బాగా నటించారు. ఫోటోగ్రఫీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లేకుండా చాలా బాగా కుదిరాయి. ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు… బాలకృష్ణ స్పష్టం చేయడం జరిగింది.


Share

Related posts

Pragya Jaiswal Beautiful Stills

Gallery Desk

Amritha Aiyer Amazing Looks

Gallery Desk

Khushi: “ఖుషి” రీ రిలీజ్ సందర్భంగా సీనియర్ హీరోయిన్ భూమిక స్పెషల్ వీడియో..!!

sekhar