Taraka Ratna: నందమూరి తారకరత్న మరణం నందమూరి కుటుంబంలో ఎంతో విషాదాన్ని నింపింది. దాదాపు 23 రోజులపాటు వైద్యులు తారకరత్ననీ బతికించడానికి అనేక రీతులుగా ప్రయత్నాలు చేశారు. విదేశాల నుండి ప్రొఫెషనల్ వైద్యులను కూడా తీసుకొచ్చి చికిత్స అందించడం జరిగింది. అయినా గాని ప్రాణాలు దక్కలేదు. తారకరత్న బతికించుకోవడానికి నందమూరి కుటుంబ సభ్యులు ఎంతగానో కృషి చేశారు. హీరో బాలకృష్ణ దాదాపు మూడు వారాలు పాటు హాస్పిటల్లోనే అనుక్షణం.. తారకరత్న ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రతి నిమిషం ఎంతో బాధ్యతగా చూసుకున్నారు.
ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహించడం జరిగింది. అయినా తారకరత్న మరణించడంతో బాలకృష్ణ ఎంతగానో తల్లడిల్లిపోయారు. ఇలాంటి తరుణంలో తారకరత్న కుటుంబ విషయంలో బాలకృష్ణ సంచలన నిర్ణయం తీసుకున్నారట. విషయంలోకి వెళ్తే తారకరత్న ముగ్గురు పిల్లల బాధ్యత పూర్తిగా తానే తీసుకోవడం జరిగింది అంట. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి కుటుంబ పరంగా అండగా ఉంటానని బాలకృష్ణ భరోసా ఇచ్చారట. అయితే నందమూరి కుటుంబంలో వరుస అకాల మరణాలు అంతులేని విషాదాన్ని నింపుతున్నాయి. ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు, ఆ తర్వాత అతని చిన్న కుమారుడు హరిన్ చక్రవర్తి రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ అరుదైన వ్యాధితో మరణించారు. హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు.
ఆ తర్వాత హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. గత ఏడాది ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు. కాగా ఇప్పుడు తారకరత్న గుండెపోటుతో మరణించడంతో నందమూరి ఫ్యామిలీ శోక సంద్రంలోకి వెళ్లిపోయింది. ఇటువంటి పరిస్థితులలో నందమూరి తారకరత్న విషయంలో బాలకృష్ణ తీసుకున్న నిర్ణయం సంచాలనంగా మారింది. తారకరత్న పార్థివదేహాన్ని ఫిలిం చాంబర్ కీ తరలించారు. అభిమానుల సందర్శనార్థం ఉంచారు. ఆ తర్వాత ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఏంటి అంజలి? మరీ ఇంత సన్నగా అయ్యావు?