Entertainment News న్యూస్ సినిమా

Balakrishna Purijagannath: ఫ్లాప్ లలో ఉన్న పూరీకి బంపర్ ఆఫర్ ఇచ్చిన బాలయ్య బాబు..!!

Share

Balakrishna Purijagannath: డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ వరుస ఫ్లాప్ లో ఉన్న సమయంలో “ఇస్మార్ట్ శంకర్” సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కటం తెలిసిందే. ఈ సినిమా తర్వాత రౌడీ విజయ్ దేవరకొండతో “లైగర్” చేయగా ఈ ఏడాది ఆగస్టు నెలలో విడుదలయ్య అట్టర్ ఫ్లాప్ అయ్యింది. పాన్ ఇండియా నేపథ్యంలో ఫస్ట్ టైం పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా… ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. అసలు పూరి జగన్నాథ్ తీసిన సినిమా లాగా లేదని జనాలు కామెంట్లు చేయడం జరిగింది.

Nandamuri Balakrishna All Set To Appear On Indian Idol Telugu As Special Guest

“లైగర్” రిజల్ట్ దెబ్బకి విజయ్ దేవరకొండ తో చేస్తున్న “జనగణమన” ప్రాజెక్టు కూడా ఆగిపోయింది. ఇటువంటి తరుణంలో ఫ్లాప్ లలో ఉన్న పూరి జగన్నాథ్..కి బాలయ్య బాబు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఇటీవల పూరి జగన్నాథ్ బాలయ్యకి ఒక లైన్ చెప్పటం జరిగిందని.. దానికి బాలయ్య ఓకే చెప్పినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. గతంలోనే బాలకృష్ణతో “పైసా వసూల్” అనే సినిమా పూరి జగన్నాథ్ చేశారు. కానీ “పైసా వసూల్” పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ సమయంలో పూరి ఎంతగానో బాధపడి.. బాలయ్యకి మంచి హిట్ ఇస్తానని తెలియజేశారు.

Puri Jagannath to work with Balayya again

కానీ అనూహ్యంగా “లైగర్” దెబ్బకి డేంజర్ జోన్ లో పడ్డ పూరి కెరీర్ కి బాలయ్య ఆపనా హస్తం ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బాలయ్య బాబు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు 80 శాతానికి పైగానే కంప్లీట్ అయింది. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తారు. ఈ రెండు ప్రాజెక్టులు అయినా వెంటనే పూరి జగన్నాథ్ సినిమా..బాలయ్య చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ లోపు పూరి కొడుకు ఆకాష్ పూరితో సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు ఫిలింనగర్ టాక్.


Share

Related posts

Ruhani Sharma Cute images

Gallery Desk

భారతీయుల ఈగో హర్ట్ చేసిన ట్రంప్..! అంత మాట అనేశాడు ఏంటి ఇక ఈయన గెలిచినట్లే…

siddhu

Intinti Gruhalakshmi: అందరు కలిసి సెల్ఫీ.. లాస్య అలక.. తులసి ఇంటికి అంకిత..!

bharani jella