Unstoppable 2: ఆహా “అన్ స్టాపబుల్” టాకీ షో ఓటిటి రంగంలో అనేక రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంది. మొదటి సీజన్ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని టాకీ షోలలో టాప్ టెన్ లో నిలిచింది. బాలయ్య హోస్ట్ గా షోలో చేస్తున్న కామెడీ వచ్చే అతీతులను అడిగే ప్రశ్నలు.. చూసే వీక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ లభిస్తుంది. మొదటి సీజన్ అనేక రికార్డులు క్రియేట్ చేయడంతో రెండో సీజన్ అంతకుమించి అన్న రీతిలో షో నిర్వాహకులు ప్లాన్ చేశారు. ఇటీవలే అక్టోబర్ 14వ తారీకు సెకండ్ సీజన్ మొదటి ఎపిసోడ్ కి చంద్రబాబు రావడం జరిగింది.
ఈ ఎపిసోడ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. 24 గంటల్లోనే 10 లక్షల వ్యూస్ రాబట్టింది. ఇదిలా ఉంటే సెకండ్ సీజన్ లో పవన్ కళ్యాణ్ వస్తున్నట్లు మొదటి నుండి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే సెకండ్ సీజన్ రెండో ఎపిసోడ్ ప్రోమోలో బాలయ్య బాబు ఇన్ డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చేశారు. రెండో ఎపిసోడ్ లో డీజే టిల్లు, విశ్వక్ సేన్ హీరోలు రావటం జరిగింది. మధ్యలో భీమ్లా నాయక్ నిర్మాత నాగ వంశీ కూడా వచ్చారు. ఈ క్రమంలో వంశీతో త్రివిక్రమ్ గురించి సంభాషణ వచ్చిన టైములో బాలకృష్ణ త్రివిక్రమ్ కి ఫోన్ చేయడం జరిగింది.
ఎప్పుడొస్తున్నావ్ మా షో కి అని బాలయ్య ప్రశ్నించగా మీరు పిలవగానే వచ్చేస్తామని.. సమాధానం ఇచ్చారు. దీంతో బాలయ్య ఎవరితో రావాలో తెలుసు కదా అంటూ.. ఇన్ డైరెక్ట్ గా పవన్ వస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. అందరికీ తెలిసిన విషయమే త్రివిక్రమ్, పవన్ మంచి స్నేహితులని. అయితే ఆహా టీం సెకండ్ సీజన్ లాస్ట్ ఎపిసోడ్ గా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ని ఆహ్వానించినట్లు సమాచారం.