NBK 107: నేడు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నందమూరి అభిమానులు భారీ సంబరాలు చేయడానికి రెడీ అవుతున్నారు. 99వ జయంతి సందర్భంగా ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. ఈ కార్యక్రమాలు 100 వ జయంతి వరకు దాదాపు ఏడాది పాటు నిర్వహించే దిశగా నందమూరి బాలయ్య బాబు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు. రాజకీయంగా ప్రస్తుతం మహానాడు మొదలు కావడంతో… అక్కడ సందడి వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యకర్తలు… మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పూనుకున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
పరిస్థితి ఇలా ఉంటే ప్రస్తుతం నందమూరి బాలయ్య బాబు “అఖండ” సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కటం తెలిసిందే. ఇక ఇదే సమయంలో ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. NBK 107 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. బాలయ్య బాబు సరసన గోపీచంద్ మలినేని లక్కీ హీరోయిన్ శృతిహాసన్ నటిస్తోంది. అయితే ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఉదయం 10 గంటల 20 నిమిషాలకు చిత్ర బృందం సినిమాకి సంబంధించి కొత్త అప్డేట్ ఇవ్వనున్నట్లు అధికారికంగా తెలిపింది. దీంతో సినిమా టైటిల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. మంచి మాస్ కథాంశం నేపథ్యంలో గోపీచంద్ మలినేని బాలయ్య బాబు ను సరికొత్తగా చూపిస్తున్నారట. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి బ్లాక్ షర్ట్ పంచెకట్టులో వర్కింగ్ టైటిల్ తో కూడిన ఫోటో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఫోటో బట్టి మైనింగ్ మాఫియా నేపథ్యంలో సినిమా ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ తరహాలో ఫ్యాక్షనిస్ట్ స్టోరీ అని డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఏది ఏమైనా ఈ రోజు ఉదయం 10 గంటల తర్వాత సినిమాకి సంబంధించి వచ్చే అప్ డేట్ బట్టి సినిమా పై ఒక ఐడియా వచ్చే అవకాశం ఉంది.