అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ 108 సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాను రీసెంట్ గా అనౌన్స్ చేశారు.. NBK 108 సినిమాకు సంబంధించి ఓ స్పెషల్ గ్లింప్స్ ని ఇటీవల రిలీజ్ చేశారు.. ఇందులో బాలయ్య లుక్స్ సరికొత్తగా ఉంది. సాహు గారపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయలతో నిర్మించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నారు.
ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. మూవీ మేకర్స్ ఈ సినిమాకు రిలీజ్ డేట్స్ ని కూడా లాక్ చేసుకున్నట్లు సమాచారం.. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలోనే విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఏప్రిల్ 7న ఫిక్స్ అయినట్లు ఫిలంవర్గాల్లో వార్త చక్కర్లు కొడుతోంది.. ఈ సినిమాకు ‘ఐ డోంట్ కేర్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు చర్చించుకుంటున్నారు. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాను సెప్టెంబర్ లో సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమాలో బాలయ్య 50 ఏళ్ల వయసున్న తండ్రి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.. ఆయన కూతురిగా పెళ్లిసందడి ఫేమ్ శ్రీలల నటిస్తుండగా.. మరో పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్ సొనాక్షి సిన్హాను సంప్రదించినట్లు వార్త వినిపిస్తోంది. బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాపై ఆల్రెడీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా రాయలసీమ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!