Subscribe for notification
Categories: సినిమా

Bala Krishna: ‘బ్రో ఐ డోంట్ కేర్’ అంటున్న బాలయ్య!

Share

Bala Krishna: గతేడాది చివర్లో బాలయ్య.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన ‘అఖండ’ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ‘అఖండ’ సక్సెస్ తర్వాత బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో నెక్ట్స్ మూవీ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సిరిసిల్లలో ప్రారంభమైంది అక్కడ ఫస్ట్ షెడ్యూల్ పూర్తైయింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి బాలయ్యకు సంబంధించిన రెండు లుక్స్‌ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. క్రాక్‌లో కథానాయికగా నటించినశృతి హాసన్ ఈ సినిమాలో బాలయ్య సరసన నటిస్తోంది.ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.

Balayya says ‘Bro I don’t care’!

అనిల్‍ బాలయ్య చిత్రానికి ‘బ్రో ఐ డోంట్ కేర్’ టైటిల్..!

ఇదిలా ఉండగా వరస హిట్లతో దూసుకుపోతున్న టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఎఫ్ 3 ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘బాలకృష్ణగారితో చేయబోయే సినిమాలో కామెడీ డోస్ ఉంటుంది, అయితే ఈ సినిమా పూర్తి ఎంటర్‌టైనర్‌ గా కాకుండా, సీరియస్ యాక్షన్ డ్రామాగానే ఉంటుంది. ఇక బాలయ్య గారిని కొత్త తరహాలో చూపించబోతున్నామని అనిల్ రావిపూడి తెలిపారు. తాజాగా ఈ చిత్రం గురించి టైటిల్ అంటూ ఒకటి బయిటకు వచ్చింది. ఆ సినిమాకు ‘బ్రో ఐ డోంట్ కేర్ అనే టైటిల్ ను ఫైనల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అనీల్ రావిపూడి రాసుకున్న కథకు ఈ టైటిల్ ఫెరఫెక్ట్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ టైటిల్ జనాల్లోకి బాగా వెళ్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Balayya says ‘Bro I don’t care’!

ఆ సినిమాతో మోక్షజ్ఞ ఎంట్రీ..?!

ప్రస్తుతం మైత్రీ మూవీస్ బ్యాన‌ర్‌లో మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అనంతరం అనిల్ రావిపూడి చిత్రంలో నటించనున్నారు. తదుపరి ఆదిత్య 369 సీక్వెల్ పైనా దృష్టి సారిస్తారని సమాచారం. ఎన్.బి.కే నటవారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ కోసం ఇప్పటి నుంచే బాలయ్య భారీ ప్లానింగ్ తో ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ తనకు ఎంతో కీలకమైనది. తనయుడిని స్వీయ దర్శకత్వంలో లాంచ్ చేయాలన్న ఆలోచన కూడా బాలయ్య కు ఉంది. మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ గురించి బోలెడంత చర్చ సాగింది. ఆదిత్య 369 సీక్వెల్ లో అతడు నటిస్తాడని బాలయ్య అతిథిగా కనిపిస్తారని.. `ఆదిత్య 999 మ్యాక్స్` అనే టైటిల్ ఫిక్స్ చేశారని కూడా ప్రచారమైంది.


Share
Ram

Recent Posts

Charan Hrithik Roshan: సంచలన దర్శకుడు డైరెక్షన్ లో వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ లో చరణ్, హృతిక్ రోషన్..??

Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…

35 mins ago

Thaman: బాలయ్య బాబు అంటే నాకు ఎమోషనల్.. కారణం అదే తమన్ సంచలన వ్యాఖ్యలు..!!

Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…

51 mins ago

Uday Kiran: అప్పట్లో హీరో ఉదయ్ కిరణ్ కి పోటీ నేనే అంటూ ఆ హీరో సెన్సేషనల్ కామెంట్స్..!!

Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…

2 hours ago

Nayanthara: భ‌ర్త‌ను కౌగిట్లో భందించి ఊపిరాడ‌కుండా చేసిన న‌య‌న్‌.. ఫొటో వైర‌ల్‌!

Nayanthara: లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. ఓ మ‌ల‌యాళ చిత్రంతో సినీ కెరీర్‌ను…

4 hours ago

Pavitra Lokesh Naresh: నరేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవిత్ర లోకేష్ భర్త..!!

Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…

4 hours ago

Gopichand-NTR: ఎన్టీఆర్ ఒకే చేసిన క‌థ‌తో గోపీచంద్ సినిమా.. ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే?

Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రిత‌మే `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి…

5 hours ago