NTR: Sr. NTR గురించి ఏమని చెప్పుకుంటాం. నందమూరి తారక రామారావు గొప్ప నటుడు అని చెప్పుకుంటామా, అంతకంటే గొప్ప ప్రజానాయకుడు అని చెప్పుకుంటామా, లేక తెలుగువారు “అన్నగారు” అని చెప్పుకుంటామా? అతగాడి గురించి ఇది అని ఏమి చెప్పుకోలేము. అతని కీర్తి ఆకాశం. అతని నటన సముద్రం, అతని నాయకత్వం ఓ అఖండం. అవును… ఎన్.టి.రామారావు గారు తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. ఈ క్రమంలో అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
జయంతి ఉత్సవాలు 365 రోజులు?
రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో ఆరాధ్య దైవంగా నిలచిపోయాడు మన అన్నగారు. కాగా అతని శత జయంతి ఉత్సవాలను 2023 మే 28 వరకూ నిర్వహించబోతున్నట్లు నందమూరి బాలకృష్ణ తాజాగా ప్రకటించారు. దానికి పునాది ఈనెల 28 నిమ్మకూరులో వేయనున్నారు. ఈ వేడుకలను నిమ్మకూరులోనే మొదలుపెట్టబోతున్నట్లు శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో MLA బాలకృష్ణ వెల్లడించారు. 365 రోజులపాటు శతపురుషుని శత జయంతి వేడుకలు నేల నలుచేరగులా జరుగనున్నాయని తెలియజేయడానికి గర్వపడుతున్నాను.. అని ఆయన అన్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మరింత సమాచారం:
మునుపెన్నడూ కనీవినీ ఎరుగనివిధంగా వివిధ దేశాలలో జరుగుతున్న ఈ వేడుకలకు నందమూరి కుటుంబం హాజరు అవ్వబోతోంది. నందమూరి కుటుంబం నుంచి నెలకొక్కరు నెలకో కార్యక్రమంలో భాగస్వాములవుతారని బాలకృష్ణ ఈ ప్రకటనలో తెలిపారు. అందులో భాగంగా నేను 28వ తేదీ ఉదయం నందమూరి వారి స్వస్థలం అయినటువంటి నిమ్మకూరు వేడుకలలో బాలకృష్ణ పాల్గొంటారని సమాచారం. 365 రోజులు.. వారానికి 5 సినిమాలు వారానికి 2 సదస్సులు.. నెలకు రెండు పురస్కార ప్రదానోత్సవాలు.. ఈ రకంగా ఆ మహత్కార్యాన్ని పెమ్మసాని(రామకృష్ణ) థియేటర్ లో ప్రారంభించి, ఒంగోలు మహానాడు లో పాల్గొంటానని బాలకృష్ణ తెలియజేసారు.