బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణ కి మంచి ట్యూనింగ్ ఉందన్న విషయం వీరి కాంబోని ప్రేక్షకులు బాగా ఆదరిస్తారన్న విషయం మళ్ళీ ప్రూవ్ అయింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య హీరోగా హ్యాట్రిక్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ సినిమా నుండి బాలకృష్ణ పుట్టినరోజు కానుకగా ‘BB3 ఫస్ట్ రోర్’ పేరుతో టీజర్ ను రిలీజ్ చేశారు బోయపాటి బృందం. ఈ టీజర్ ప్రేక్షకులను విపరితంగా ఆకట్టుకొని 10 మిలియన్ డిజిటల్ వ్యూస్ ని దాటిసెన్సేషన్ క్రియేట్ చేసింది. అంతేకాదు బీబీ3 ఫస్ట్ రోర్ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్లో నెం.1 ట్రెండింగ్ లో ఉంది.
గత కొంతకాలంగా వరస ఫ్లాప్స్ తో బాక్సాఫీస్ వద్ద బాలకృష్ణ మార్కెట్ బాగా పడిపోయింది. ఒకరకంగా దర్శకుడు బోయపాటి శ్రీను పరిస్థి కూడా అంతే అని చెప్పాలి. కాని ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ హ్యాట్రిక్ సినిమా BB3 టీజర్ తిరిగి ఈ ఇద్దరి స్టామినాని నిరూపించింది. ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ‘మోనార్క్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు బోయపాటి.
ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తుండగా హీరోయిన్ గా కొత్త అమ్మాయిని పరిచయం చేస్తారని తెలుస్తుంది. గతంలో బాలయ్యకు ‘సింహ’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్స్ ని ఇచ్చిన బోయపాటి మరోసారి ఆ స్థాయి హిట్ ఇవ్వడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాడు.