Unstoppable 2: “అన్ స్టాపబుల్ 2” షో త్వరలో ప్రారంభం కావటానికి ముస్తాబయిపోయింది. మొదటి సీజన్ మొత్తం సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీనటులు రావటం తెలిసిందే. మొదటి సీజన్ ఈ టాకీషో ఎంతోమందిని ఆకట్టుకుంది. ఓటిటి ప్లాట్ ఫామ్ లో అప్పుడే అడుగుపెట్టిన ఆహాకి అన్ స్టాపబుల్ మొదటి సీజన్ ఎంతో మైలేజ్ ఇచ్చింది. ముఖ్యంగా బాలయ్య బాబు ఫస్ట్ టైం హోస్ట్ గా కనిపించడంతో షోపై ఆసక్తి పెరిగింది. ఇదే సమయంలో బాలయ్య తనదైన శైలిలో ఈ టాకీ షోలో యాంకరింగ్ చేసి అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఎదుట వ్యక్తి నుండి రాబట్టేలా ప్రశ్నలు వేస్తూ.. హోస్ట్ గా కూడా తనకు తిరుగు లేదని బాలయ్య నిరూపించారు.
“అన్ స్టాపబుల్” మొదటి సీజన్ ఇండియాలోనే ఓటీటీ రంగంలో అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు “అన్ స్టాపబుల్ 2” వస్తూ ఉండటంతో షో కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ షోకి సంబంధించి ప్రకటన బాలయ్య బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ వీక్షకులలో ఎంతో ఇంట్రెస్ట్ కలిగించింది. కాగా అక్టోబర్ 4వ తారీఖు సాయంత్రం విజయవాడలో “అన్ స్టాపబుల్ 2” ప్రోమో బాలయ్య బాబు రిలీజ్ చేశారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆధ్వర్యంలో “అన్ స్టాపబుల్ 2” టీజర్ షూట్ జరిగింది. ప్రోమో చూశాక మరింత అంచనాలు షోపై పెరిగిపోయాయి. ఈ సందర్భంగా బాలయ్య బాబు మాట్లాడటం జరిగింది.
స్పీచ్ లో భాగంగా ఇంటిలో తన భార్య వసుంధర దేవి అన్ స్టాపబుల్ అని స్పష్టం చేశారు. నన్ను నా కుటుంబాన్ని భరిస్తుంది. ఇంకా అదే విధంగా నా రాజకీయాలకు సంబంధించిన విషయాలలో అదేవిధంగా క్యాన్సర్ హాస్పిటల్ విషయాలలో ఆమె కలగజేసుకుంటది. ఇక ఇదే సమయంలో యాంకర్ సీజన్ 2లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వస్తున్నట్లు వార్తలపై బాలకృష్ణ ని ప్రశ్నలు అడగటం జరిగింది. ఏమో చెప్పలేను. కానీ కచ్చితంగా సమయాన భావం బట్టి.. వాళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని.. బాలకృష్ణ సరికొత్త విషయాన్ని తెలియజేశారు.