గత ఏడాది నందమూరి బాలయ్య బాబు 60వ పుట్టినరోజు సందర్భంగా పలువురు చానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలు తెలియజేయడం జరిగింది. ప్రతి మీడియా ఛానల్ అదేవిధంగా వెబ్ మీడియాలో బాలయ్య బాబు కి ఎదురైన ప్రశ్న కొడుకు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఎప్పుడు అనేది. ఈ విషయంలో కచ్చితంగా టైం వస్తే అని చెప్పి… ఎక్కువశాతం వచ్చే ఏడాది ఎంట్రీ ఉండొచ్చు అన్న రీతిలో బాలయ్య బాబు కామెంట్లు చేయడం జరిగింది.
ఇదిలా ఉంటే మోక్షజ్ఞ సినిమా ఎంట్రీకి ముహూర్తం ఖరారు అయినట్లు నందమూరి బాలయ్య 61వ పుట్టినరోజు సమయంలో మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా విశేషాలు బయటకు రావడం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వారాహి నిర్మాణ సంస్థ ఈ సినిమాని తెరకెక్కించనున్నట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ వార్త ఒకటి వైరల్ అవుతుంది.
పాన్ ఇండియా తరహాలో ఈ సినిమా స్క్రిప్ట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మోక్షజ్ఞ వయసు 23 కావటంతో.. ఇలాంటి వయసులోనే సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల కొడుకులు వెండితెరపై ఎంట్రీ ఇవ్వటంతో.. ఏడాదిలోనే వారసుడు మోక్షజ్ఞ ని సినీ ఫీల్డ్ లోకి దింపడానికి బాలయ్య డిసైడ్ అయినట్లు ఫిలిం వర్గాల టాక్. దీంతో ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో రానున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!