Neha Oberoi: పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన బాలు సినిమాలో పవన్ కి జోడిగా నేహా ఒబెరాయ్ జత కట్టి ఎంతో సందడి చేశారు. కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన బాలు సినిమాలో తన అందచందాలతో ఎంతోమంది ప్రేక్షకుల మదిని కొల్లగొట్టింది. నేహా ఒబెరాయ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత అయిన ధరమ్ ఒబేరాయ్ కూతురు. ధరమ్ ఒబెరాయ్ నిర్మాత మాత్రమే కాకుండా, బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించి మంచి దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు.
పవన్ కళ్యాణ్ బాలు సినిమాలో తన అమాయకత్వపు నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.బాలు సినిమా తరువాత చాలా కాలం పాటు తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న నేహా తర్వాత జగపతిబాబు నటించిన బ్రహ్మాస్త్రం సినిమాలో కనిపించింది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీకి దూరమై బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించారు.
నేహా ఒబెరాయ్:
బాలీవుడ్లో దస్ కహానియా,ఈ ఎం ఐ,వుడ్ స్టాక్ విల్లా, ఆస్మాన్ చిత్రాల్లో నటించింది. ఈ సినిమాలో కూడా నేహకు పెద్దగా కలిసి రాలేదు. ఇక సినిమాలకు దూరంగా ఉంటూ 2010వ సంవత్సరంలో డైమండ్ వ్యాపారి విశాల్ షాను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం నేహా ఒబెరాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ క్లబ్ ఆఫ్ ఏషియన్ అకాడమీలో మెంబర్ గా ఉంది. ఇక సినిమాల విషయానికి వస్తే మంచి కథలు దొరికితే తిరిగి సినిమాలలో నటించడానికి ఈమె సిద్ధంగా ఉన్నారు. తెలుగులో పవన్ కళ్యాణ్ , కరుణాకరణ్ కాంబినేషన్ లోతొలిప్రేమ సినిమా తెరకెక్కిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. వీరిద్దరి కాంబినేషన్లో తర్వాత సినిమా బాలు. ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ లో రౌడీ పాత్రలో, తర్వాత సాధారణ మనిషిలా మారిపోయిన కథాంశంతో తెరకెక్కింది.