Bandla Ganesh: టాలీవుడ్ ఇండస్ట్రీలో కెరియర్ మొదట్లో చిన్న, చిన్న పాత్రలు చేసి నిర్మాతగా మారిన బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బండ్ల గణేష్ స్టేజ్ ఎక్కి మైక్ పట్టినా, సోషల్ మీడియా లో ట్వీట్స్ పెట్టిన ఓ రేంజ్ లో పాపులర్ అవుతారు. ఈ విధంగా బండ్ల గణేష్ పాపులర్ కావడానికి గల కారణం ఆయన చేసే తప్పులే. ఈ విధంగా బండ్ల గణేష్ చేసే ట్వీట్స్ కూడా బాగా పాపులర్ అవుతాయి. అయితే ట్వీట్స్ లో తప్పులు దొర్లడంతో మాటిమాటికి డిలీట్ చేస్తూ పోస్టల్ పెడుతుంటాడు.
ఈ క్రమంలోనే బండ్ల గణేష్ మరో సారి తప్పు చేసి అడ్డంగా దొరికిపోయాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా నవ్వుల పాలయ్యారు. ఎప్పుడు ఏదో ఒక విషయంపై ట్వీట్ పెట్టే బండ్లగణేష్ కొన్నిసార్లు ఇంగ్లీష్ పరిజ్ఞానం కూడా ఉపయోగిస్తుంటారు. అయితే ఆ ఇంగ్లీష్ లో కూడా ఎన్నో తప్పులు దొర్లుతుంటాయి. దీన్ని బట్టి చూస్తే బండ్ల గణేష్ కు సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలియదని ఇట్టే అర్థం అవుతుంది.
బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్:
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే బండ్లగణేష్ తాజాగా ఇంస్టాలోకి అడుగు పెడుతున్నట్లు ప్రకటించారు. అప్పటివరకు అంతా బానే ఉంది. ఇక్కడే అసలు విషయం బయటపడింది. బండ్ల గణేష్ ఇంస్టాలోకి వస్తున్న విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇన్స్టాల్ లోకి ఎంట్రీ ఇస్తున్నా.. ఇదేనా ఐడి అంటూ పోస్ట్ చేస్తూ ఇన్స్టా కు సంబంధించిన లింకు పెట్టడం మర్చిపోయాడు. ఈ విధంగా ఈ ట్వీట్ రెండు మూడు సార్లు డిలీట్ చేసి మళ్లీ పెట్టిన అవే తప్పులు కనిపించడంతో నెటిజన్లు బండ్ల గణేష్ ను టార్గెట్ చేసారు. బండ్ల అన్న అసలు ఏం చేస్తున్నావ్ నువ్వు? ఎందుకు పోస్ట్ లు పెడుతున్నావ్? ఎందుకు డిలీట్ చేస్తున్నావ్ అంటూ నెటిజన్లు ఓ రేంజ్ లో కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఇన్స్టాల్ లోకి ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్ మొట్టమొదటి పోస్ట్ పవన్ కళ్యాణ్ కు సంబంధించినది పెట్టి పవన్ భక్తుడని మరోసారి నిరూపించుకున్నాడు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!