Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడు సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీకి దూరం కావడంతో “వకీల్ సాబ్” తో స్టార్ట్ చేసి వరుస ప్రాజెక్టులు లైన్ లో పెట్టడం జరిగింది. అభిమానుల ఆకలి తీర్చడానికి ఒకేసారి రెండు షూటింగ్ లు చేస్తూనే మరో పక్క కొత్త సినిమాలు పవన్ ఒప్పుకుంటున్నారు. ప్రస్తుతం రాణా తో మల్టీస్టారర్ సినిమా చేస్తూనే మరోపక్క క్రిష్ దర్శకత్వంలో “హరిహర వీరమల్లు” అనే సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నా పరిస్థితి.
ఇది కాకుండా హరీష్ శంకర్ దర్శకత్వంలో అదే రీతిలో సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో పవన్ సినిమాలను లైన్ లో పెట్టడం జరిగింది. మరోపక్క బండ్లగణేష్ కూడా కొత్త సినిమా చేయటానికి బాసు ఒప్పుకున్నట్లు త్వరలోనే అన్ని విషయాలు తెలియజేస్తానని అప్పట్లో బండ్లగణేష్ సోషల్ మీడియా సాక్షిగా తెలపడం జరిగింది. ఇలాంటి తరుణంలో రీసెంట్ గా బండ్లగణేష్ నిర్మాణ సారధ్యంలో పవన్ కళ్యాణ్ హీరోగా రమేష్ వర్మ అనే డైరెక్టర్ స్టోరీ లాక్ చేసినట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి.
అయితే వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తాజాగా బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చారు. ఏదైనా ప్రాజెక్టు ఓకే అయితే తానే ప్రకటిస్తాను సోషల్ మీడియాలో .. వస్తున్న వార్తలను నమ్మవద్దని పేర్కొన్నారు. బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ తో మొట్టమొదటిసారి “తీన్మార్” అనే సినిమా చేశారు. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది వెంటనే “గబ్బర్ సింగ్” చేసి బ్లాక్ బస్టర్ అందుకోవడం జరిగింది. అప్పటినుండి మరోసారి పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం కోసం బండ్ల గణేష్ అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు.