RGV Perni Nani: ఆర్జీవీ – పేర్ని నాని ట్విటర్ గొడవలో మీరు ఊహించని వ్యక్తి దూరాడు .. ఇక మామూలుగా ఉండదు !!

Share

RGV Perni Nani: సినిమా టికెట్ల ధరలను ఏపీ ప్రభుత్వం తగ్గించడం పట్ల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopalvarma) తీవ్ర స్థాయిలో గత కొద్ది రోజుల నుండి విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎలక్ట్రానిక్ మీడియాలో అదేవిధంగా సోషల్ మీడియాలో తనదైన శైలిలో ఏపీ ప్రభుత్వానికి .. ప్రశ్నలు సంధిస్తూ మంత్రులపై అదే విధంగా ముఖ్యమంత్రి జగన్(Jagan) పై మండిపడుతూ ఉన్నారు. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ శాఖ చూస్తున్న మంత్రి పేర్ని నాని(Perni Nani)ని టార్గెట్ చేసుకుని.. రామ్ గోపాల్ వర్మ ప్రశ్నలు వేయటం మాత్రమే కాక.. ప్రభుత్వ పనితీరుని విమర్శించే తరహాలో కామెంట్లు చేయడం జరిగింది. ఇక ఇదే తరుణంలో ట్విట్టర్ వేదికగా మంత్రి పేర్ని నాని కూడా రామ్ గోపాల్ వర్మ చేస్తున్న కామెంట్లకు వేసిన ప్రశ్నలకు తనదైన శైలిలో రియాక్ట్ అవుతున్నారు.

Mind Game! RGV playing Bandla Ganesh in Power Star?

దీంతో వీరిద్దరి మధ్య ట్విట్టర్ వేదికగా గొడవ నడుస్తూ ఉండగా… ఈ గొడవలోకి టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీ తరఫున ఊహించిన వ్యక్తి.. ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన మరెవరో కాదు బండ్లగణేష్. ఇండస్ట్రీ తరఫున ఏపీ ప్రభుత్వాన్ని అదేరీతిలో మంత్రి పేర్ని నాని తనదైన శైలిలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాదిరిగానే… ప్రశ్నలతో ఇరుకున పెట్టడానికి రెడీ అవుతున్నట్లు ఈ క్రమంలో మెగా కుటుంబం సపోర్ట్ కూడా.. బండ్ల గణేష్(Bandlaganesh) తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది.

Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌కు అరెస్ట్‌ వారెంట్‌ జారీ.. ఆ  కేసులో | Ongole Court Issue Arrest Warrant to Producer Bandla Ganesh in  Cheque Bounce Case | TV9 Telugu

టికెట్ ధరల వ్యవహారం అదేరీతిలో సినిమా ధియేటర్ల సమస్యలు మరియు.. బెనిఫిట్ షో గురించి.. సోషల్ మీడియా వేదికగా బండ్లగణేష్ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇండస్ట్రీ తరఫున సమస్యలు వినిపించడానికి ఆర్జివి.. మంత్రి పేర్ని నాని నీ అపాయింట్మెంట్ కోరగా.. పేర్ని నాని ఓకే చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇద్దరూ ఎప్పుడు కలుస్తారు అనేది చాలా సస్పెన్స్ గా ఉంది. ఆర్జీవి వర్సెస్ మంత్రి పేర్ని నాని అనే తరహాలో.. టికెట్ల వ్యవహారం ట్విట్టర్ వేదికగా కొనసాగింది. దీంతో ఇద్దరూ నేరుగా కూర్చుని మాట్లాడుకున్నాక.. పరిస్థితి ఏ విధంగా ఏ ఉంటుందో అని అందరూ వీరిద్దరి బేటీ గురించి ఆసక్తిగా ఉన్నారు.


Share

Related posts

Nivisha Yellow Saree Photos

Gallery Desk

Allu Arjun Pushpa video leak : పుష్ప వీడియో లీక్ చేసిన వాడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అల్లూ అర్జున్ ?

Teja

NTR – NBK: కిర్రాక్ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. “శ్రీరామ దండకం” కి టైం ఫిక్స్..!!

bharani jella